గ్రామ సచివాలయాలు హిట్ అని పరోక్షంగా బాబు అంగీకారం

చంద్రబాబు ఎప్పుడూ కూడా విజయాన్ని తన ఖాతాలో వేసుకుని… ఫెయిల్యూర్‌ను పక్కోడి ఖాతాలో వేస్తుంటారు అన్నది విమర్శ. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ నిర్ణయం వల్లనైనా మంచి పేరు వస్తే ఆ ఆలోచన తనదే అని చెప్పుకునే వారు. తేడా వస్తే మాత్రం అధికారులు తప్పుదోవ పట్టించారు అంటూ మీడియా ద్వారా ప్రచారం చేయించుకునేవారు. ఇప్పుడు గ్రామ సచివాలయాలపైనా చంద్రబాబు కన్నుపడింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి, […]

Advertisement
Update:2019-10-03 02:17 IST

చంద్రబాబు ఎప్పుడూ కూడా విజయాన్ని తన ఖాతాలో వేసుకుని… ఫెయిల్యూర్‌ను పక్కోడి ఖాతాలో వేస్తుంటారు అన్నది విమర్శ. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ నిర్ణయం వల్లనైనా మంచి పేరు వస్తే ఆ ఆలోచన తనదే అని చెప్పుకునే వారు. తేడా వస్తే మాత్రం అధికారులు తప్పుదోవ పట్టించారు అంటూ మీడియా ద్వారా ప్రచారం చేయించుకునేవారు.

ఇప్పుడు గ్రామ సచివాలయాలపైనా చంద్రబాబు కన్నుపడింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి, అందులో లక్షా 34వేలు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చి గ్రామ సచివాలయ వ్యవస్థకు జగన్ శ్రీకారం చుట్టారు. జగన్‌ ఆలోచనకు పార్టీలకతీతంగా ప్రశంసలు కురుస్తున్నాయి. నిరుద్యోగులకు కొండంత ధైర్యం వచ్చింది.

ఈనేపథ్యంలో గ్రామ సచివాలయాల ఆలోచన తనదే అని ప్రకటించుకున్నారు చంద్రబాబు. తాను 2003లోనే గ్రామ సచివాలయాలను ప్రారంభించానని గుంటూరులో వ్యాఖ్యానించాడు. జగన్‌ తీరు ఎవరి విశ్లేషణకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించాడు.

చంద్రబాబు గ్రామ సచివాలయాలను తాను 2003లోనే ప్రారంభించానని చెప్పాడు అంటే … జగన్‌ ఆలోచన విజయవంతం అయినట్టే అని భావించాలి. ఎలాగో గ్రామ సచివాలయాల ఆలోచన సూపర్ హిట్ అయ్యేలా ఉంది కాబట్టి క్రెడిట్ మొత్తం జగన్‌కే వెళ్లకుండా ఈ ఆలోచనకూ పితామహుడు చంద్రబాబేనట అని కొందరినైనా నమ్మించాలి అన్నది ఆయన ఆలోచన కావొచ్చు.

వీలైతే ఆయన పత్రికలు కూడా రంగంలోకి దిగి అప్పట్లో చంద్రబాబు ఇలా చేశారు అంటూ కథనాలు రాయవచ్చు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం చంద్రబాబు గ్రామ సచివాలయాలను చిధ్రం చేసింది అని ఆరోపించనూ వచ్చు. కానీ గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు గ్రామ స్వరాజ్యం ఎక్కడికి పోయింది అని మాత్రం అడగకూడదు.

Tags:    
Advertisement

Similar News