ప్లాట్‌ఫాం టికెట్‌ బదులు... ప్యాసింజర్ టికెట్‌ కొంటున్న జనం

ప్రజల్లో తెలివితేటలు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మన మంచికే అన్న నమ్మకం కోల్పోయిన జనం… ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మన జేబులు ఖాళీ చేయడానికే అని నిర్ధారణకు వచ్చిన తర్వాత చాలా జాగ్రత్త పడిపోతున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కౌంటర్‌ రెడీ చేసుకుంటున్నారు. దసరా సెలవుల సందర్భంగా రైల్వే స్టేషన్ లో రద్దీ విపరీతంగా ఉంటుందని… బంధువులకు వీడ్కోలు పలికేందుకు వచ్చే వారు స్టేషన్ లోపలికి రావాలంటే భయపడేలా చేయాలన్న ఉద్దేశంతో ప్లాట్‌ఫాం […]

Advertisement
Update:2019-10-02 03:03 IST

ప్రజల్లో తెలివితేటలు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మన మంచికే అన్న నమ్మకం కోల్పోయిన జనం… ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మన జేబులు ఖాళీ చేయడానికే అని నిర్ధారణకు వచ్చిన తర్వాత చాలా జాగ్రత్త పడిపోతున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కౌంటర్‌ రెడీ చేసుకుంటున్నారు.

దసరా సెలవుల సందర్భంగా రైల్వే స్టేషన్ లో రద్దీ విపరీతంగా ఉంటుందని… బంధువులకు వీడ్కోలు పలికేందుకు వచ్చే వారు స్టేషన్ లోపలికి రావాలంటే భయపడేలా చేయాలన్న ఉద్దేశంతో ప్లాట్‌ఫాం టికెట్ ధరను అమాంతం పెంచేసింది రైల్వే . అప్పటి వరకు 10 రూపాయలు ఉన్న ప్లాట్ ఫాం టికెట్‌ ధరను 30కి పెంచేసింది.

ఇది కొద్ది మేర ఫలితాన్ని ఇస్తున్నా… కొందరు మాత్రం కొత్త ఐడియా కనిపెట్టారు. 30 రూపాయలు పెట్టి ప్లాట్‌ఫాం టికెట్‌ కొనకుండా కనీసం చార్జీగా ఉన్న 10 రూపాయాలతో ప్యాసింజర్ రైలు టికెట్ కొంటున్నారు. పైగా ప్లాట్‌ఫాం టికెట్‌ కాల పరిమితి రెండు గంటలే. అదే ప్యాసింజర్ టికెట్‌ వల్ల అయితే ఆ ఇబ్బంది కూడా లేదు.

రైల్వే చర్యల మీద మరింత కోపం ఉన్న వారు స్టేషన్‌ నుంచి బయటకు వెళ్తూ వెళ్తూ తాను కొనుగోలు చేసిన ప్యాసింజర్ రైలు టికెట్‌ను మరొకరి చేతుల్లో పెట్టేసి వెళ్తున్నారు.

Tags:    
Advertisement

Similar News