ఐపీఎల్-13 వేలం వేదిక కోల్ కతా

డిసెంబర్ 19 నుంచి వేలం హంగామా ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన టీ-20 లీగ్ ఐపీఎల్ సరికొత్త సీజన్ వేలానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. 2020 ఐపీఎల్ సీజన్ కోసం…కోల్ కతా వేదికగా డిసెంబర్ 19 నుంచి వేలం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బెంగళూరుకు బై…కోల్ కతాకు సై… ఐపీఎల్ 12 సీజన్ల చరిత్రలో అత్యధికసార్లు వేలం నిర్వహించిన ఘనత బెంగళూరు నగరానికే దక్కుతుంది. అయితే…తొలిసారిగా వేలం కార్యక్రమాన్ని.. కోల్ కతా ఫ్రాంచైజీ ప్రధాన కేంద్రం కోల్ కతా నగరంలో నిర్వహించనున్నట్లు ఐపీఎల్ […]

Advertisement
Update:2019-10-01 10:56 IST
  • డిసెంబర్ 19 నుంచి వేలం హంగామా

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన టీ-20 లీగ్ ఐపీఎల్ సరికొత్త సీజన్ వేలానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. 2020 ఐపీఎల్ సీజన్ కోసం…కోల్ కతా వేదికగా డిసెంబర్ 19 నుంచి వేలం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

బెంగళూరుకు బై…కోల్ కతాకు సై…

ఐపీఎల్ 12 సీజన్ల చరిత్రలో అత్యధికసార్లు వేలం నిర్వహించిన ఘనత బెంగళూరు నగరానికే దక్కుతుంది. అయితే…తొలిసారిగా వేలం కార్యక్రమాన్ని.. కోల్ కతా ఫ్రాంచైజీ ప్రధాన కేంద్రం కోల్ కతా నగరంలో నిర్వహించనున్నట్లు ఐపీఎల్ బోర్డు ప్రకటించింది.

ఒక్కో ఫ్రాంచైజీకి 85 కోట్ల రూపాయలు…

ఐపీఎల్ 13వ సీజన్ కు వివిధ ఫ్రాంచైజీలు తమతమ జట్లను సిద్ధం చేసుకోడానికి 85 కోట్ల రూపాయల చొప్పున గత ఏడాదే బోర్డు కేటాయించింది.

ప్రస్తుత సీజన్ వేలంలో అత్యధికంగా 8 కోట్ల 20 లక్షల రూపాయల మిగులుతో ఢిల్లీ క్యాపిటల్స్ వేలం బరిలోకి దిగనుంది.

రాజస్థాన్ రాయల్స్ 7 కోట్ల 15 లక్షలు, కోల్ కతా నైట్ రైడర్స్ 6 కోట్ల 50 లక్షల రూపాయల బడ్జెట్ తో వేలం కార్యక్రమంలో పాల్గోనున్నాయి.

ముంబై ఇండియన్స్ 3 కోట్ల 55 లక్షలు, బెంగళూరు కోటీ 80 లక్షలు, హైదరాబాదా సన్ రైజర్స్ 5కోట్ల 30 లక్షల రూపాయల మొత్తంతో వేలం వేటకు దిగబోతున్నాయి.

2019 ఐపీఎల్ సీజన్లో ఒక్కో ఫ్రాంచైజీకి వేలం కోసం 82 కోట్ల రూపాయలు చొప్పున కేటాయించగా… 2020 సీజన్లో ఆ మొత్తాన్ని 85కోట్ల రూపాయలకు పెంచడం విశేషం.

2021 సీజన్ నుంచి ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ ప్రస్తుత జట్లను రద్దు చేసి…సరికొత్త కాంబినేషన్ తో రూపుదిద్దుకొనే జట్ల కోసం మెగా వేలంలో పాల్గొనాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News