రిలీజ్ కు ముందే టైటిల్ సాంగ్ రిలీజ్...

ప్రచారం విషయంలో పూర్తిగా బాలీవుడ్ ఫార్మాట్ లోకి వెళ్లిపోయింది సైరా. విడుదలకు ముందే వీడియో సాంగ్ రిలీజ్ చేసింది. అది కూడా టైటిల్ సాంగ్ కావడం విశేషం. అవును.. సైరా సినిమాకు సంబంధించి టైటిల్ సాంగ్ రిలీజైంది. ఇప్పటికే ఆడియోతో ఈ సాంగ్ హిట్ అవ్వగా, ఇప్పుడు అదే సాంగ్ ఫుల్ వీడియోను కూడా విడుదల చేశారు. సైరా సినిమాకు సంబంధించి బెంగళూరులో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సైరా టైటిల్ సాంగ్ రిలీజ్ […]

Advertisement
Update:2019-09-30 08:30 IST

ప్రచారం విషయంలో పూర్తిగా బాలీవుడ్ ఫార్మాట్ లోకి వెళ్లిపోయింది సైరా. విడుదలకు ముందే వీడియో సాంగ్ రిలీజ్ చేసింది. అది కూడా టైటిల్ సాంగ్ కావడం విశేషం. అవును.. సైరా సినిమాకు సంబంధించి టైటిల్ సాంగ్ రిలీజైంది. ఇప్పటికే ఆడియోతో ఈ సాంగ్ హిట్ అవ్వగా, ఇప్పుడు అదే సాంగ్ ఫుల్ వీడియోను కూడా విడుదల చేశారు.

సైరా సినిమాకు సంబంధించి బెంగళూరులో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సైరా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఎప్పట్లానే 5 భాషల్లో విడుదలైంది టైటిల్ సాంగ్. ఈ సినిమాలో కేవలం 2 పాటలు మాత్రమే ఉన్నాయనే విషయం తెలిసిందే. అందులో ఒక పాటను ఇలా విడుదలకు ముందే రిలీజ్ చేశారు. ఈరోజు లేదా రేపు మరో మాంటేజ్ సాంగ్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సైరా సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా బాహుబలి-2 రికార్డుల్ని తిరగరాస్తుందంటున్నారు చాలామంది. అయితే స్వయంగా చిరంజీవి రంగంలోకి దిగి ఈ అంచనాల్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. బాహుబలి-2తో తమ సినిమాకు పోటీ లేదని, కేవలం తన చిరకాల కోరికను తీర్చుకునే ఉద్దేశంతో, మరుగునపడిపోయిన ఓ స్వతంత్య్ర సమరయోధుడి గురించి చెప్పాలనే ఆలోచన తోనే సైరా చేశామంటున్నారు.

Tags:    
Advertisement

Similar News