ఒక్క పాట కోసం 4,500 డ్యాన్సర్లట...!

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. మొట్ట మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్యన విడుదల కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా గురించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో […]

Advertisement
Update:2019-09-27 06:54 IST

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. మొట్ట మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్యన విడుదల కాబోతోంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా గురించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక జాతర పాట ఉంటుందట. అయితే ఈ పాట గురించిన ఒక వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈ జాతర పాట కోసం ఏకంగా 4500 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారట. ఈ పాట వీడియో షూటింగ్ 14 రోజులపాటు జరిగిందని సమాచారం. ఇప్పటిదాకా కేవలం ఒక్క పాట కోసం ఇంత మంది డ్యాన్సర్ లను తీసుకోవడం ఇదే మొదటిసారి. ఇలా ‘సై రా’ విడుదలకు ముందే రికార్డులు సృష్టించడం మొదలు పెట్టేసింది అన్నమాట.

అమితాబచ్చన్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై స్వయంగా భారీ బడ్జెట్ నిర్మించాడు. ఇప్పటిదాకా విడుదలైన 2 ట్రైలర్ లు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ని అందుకున్నాయి.

Tags:    
Advertisement

Similar News