రజినీ, కమల్... చిరంజీవి రాజకీయ సలహా !
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే హీరోల పేర్లలో మొదటి రెండు రజినీకాంత్, కమల్ హాసన్. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలుగా కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న ఈ ఇద్దరూ ఈ మధ్యనే రాజకీయాలలోకి సైతం అడుగు పెట్టారు. ఒకవైపు కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ అనే రాజకీయ పార్టీని స్థాపించగా, రజినీకాంత్ త్వరలో తన పార్టీ పేరు, పార్టీ గుర్తుని ప్రకటించనున్నాడు. అయితే ఇలానే స్టార్ హీరోగా ఉన్న సమయంలో […]
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే హీరోల పేర్లలో మొదటి రెండు రజినీకాంత్, కమల్ హాసన్. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలుగా కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న ఈ ఇద్దరూ ఈ మధ్యనే రాజకీయాలలోకి సైతం అడుగు పెట్టారు.
ఒకవైపు కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ అనే రాజకీయ పార్టీని స్థాపించగా, రజినీకాంత్ త్వరలో తన పార్టీ పేరు, పార్టీ గుర్తుని ప్రకటించనున్నాడు.
అయితే ఇలానే స్టార్ హీరోగా ఉన్న సమయంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు.
ఈ నేపథ్యంలో చిరంజీవి ఈ మధ్యనే కమల్ హాసన్, రజనీకాంత్ లకు ఒక సలహా ఇచ్చాడట. 2009లో ప్రజారాజ్యం పార్టీ పైన చిరంజీవి, 2019లో జనసేన పార్టీ పై చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికలలో పాల్గొని ఘోరపరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే.
దీనిని ఉదాహరణ గా చెప్పి… రాజకీయాలలో ధన, కుల సమీకరణలు ఎక్కువగా ఉంటాయని… ఇలాంటి సమయంలో రాజకీయాల్లోకి రావడం సమయం వృధా చేసుకోవడమేనని రజినీకాంత్, కమల్ హాసన్ కు సలహా ఇచ్చాడట చిరంజీవి.