మరో తప్పుడు నిర్ణయం తీసుకున్న సూర్య

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేవాడే క్లిక్ అవుతాడు. అది సినీపరిశ్రమ కావొచ్చు, మరే ఇతర రంగంలోనైనా కావొచ్చు. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి టైమింగ్ ను పూర్తిగా మిస్ అవుతున్నాడు సూర్య. తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడు ఈ హీరో. ఇలాంటి టైమ్ లో సూర్య తీసుకున్న ఈ నిర్ణయం సరైనది కాదు. సూర్యను తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయమని ఎంతోమంది అభ్యర్థించారు. కొంతమంది నిర్మాతలు క్రేజీ ఆఫర్లు కూడా ఇచ్చారు. […]

Advertisement
Update:2019-09-26 06:15 IST

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేవాడే క్లిక్ అవుతాడు. అది సినీపరిశ్రమ కావొచ్చు, మరే ఇతర రంగంలోనైనా కావొచ్చు. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి టైమింగ్ ను పూర్తిగా మిస్ అవుతున్నాడు సూర్య. తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడు ఈ హీరో. ఇలాంటి టైమ్ లో సూర్య తీసుకున్న ఈ నిర్ణయం సరైనది కాదు.

సూర్యను తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయమని ఎంతోమంది అభ్యర్థించారు. కొంతమంది నిర్మాతలు క్రేజీ ఆఫర్లు కూడా ఇచ్చారు. తెలుగు ఫ్యాన్స్ అయితే చాలా రిక్వెస్ట్ చేశారు. ఇదంతా ఒకప్పుడు. సూర్య మంచి ఫామ్ లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు సూర్య పరిస్థితి రివర్స్ అయింది. రీసెంట్ గా వచ్చిన బందోబస్త్ సినిమాకు పైకి కూడా చెప్పుకోలేని స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. అంతకంటే ముందొచ్చిన ఎన్జీకే సినిమా అయితే డబుల్ డిజాస్టర్ అనిపించుకుంది. ఇలా పూర్తిగా క్రేజ్ పోగొట్టుకున్న టైమ్ లో తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలని సూర్య నిర్ణయించడం రాంగ్ డెసిషన్.

ప్రస్తుతం బీవీఎస్ రవి, గోపీమోహన్ తో చర్చలు జరుపుతున్నాడు సూర్య. వీళ్లిద్దర్లో ఎవరో ఒకరి కథను ఆయన ఓకే చేసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత దర్శకుడు ఎవరనే విషయాన్ని నిర్ణయిస్తారు. ప్రస్తుతం తెలుగులో సూర్య పరిస్థితి పూర్తిగా దిగజారింది. అతడి సినిమాలకు డబ్బులు రావడం మాట అటుంచి, కనీసం అతడి సినిమాల శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడుపోవడం లేదు.

Tags:    
Advertisement

Similar News