సైరా లో ఈ సన్నివేశం హైలైట్ కాబోతుందట !

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ‘సైరా నరసింహారెడ్డి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. మొట్ట మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార, సుదీప్, తమన్నా, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తూండటం తో […]

Advertisement
Update:2019-09-24 06:39 IST

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ‘సైరా నరసింహారెడ్డి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతోంది.

మొట్ట మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార, సుదీప్, తమన్నా, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తూండటం తో ఈ సినిమా పై తెలుగులో మాత్రమే కాక ఇతర భాషల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. ముఖ్యంగా సినిమాలో కర్నూల్ లోని నోస్సాం ఫోర్ట్ వద్ద జరిగే యుద్ద సన్నివేశం సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర బృందం కేవలం ఈ ఒక్క సన్నివేశం కోసం 35 రాత్రులు రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు మరియు ఫైటర్ లతో కష్టపడి చిత్రీకరించినట్లు సమాచారం.

సినిమాలో ఈ సన్నివేశం కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటుంది సినిమా యూనిట్. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News