సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా...

సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా… సింగిల్ జడ్జి బెంచ్ బెయిల్ పిటిషన్లను విచారించే అవకాశం ఏర్పడింది. ఇప్పటివరకు డివిజన్ బెంచ్ లేదా ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ మాత్రమే బెయిల్, బదిలీ కేసులపై విచారణ జరిపేది. ఇప్పుడు కొత్త నిబంధనలు రూపొందడం తో ఒకే న్యాయమూర్తికి ఇటువంటి కేసులను విచారించడానికి అవకాశం ఏర్పడుతున్నది. ఈ నిబంధన అమలులోకి వస్తే… ఒకే న్యాయమూర్తి బెయిల్, బదిలీ సమస్యలకు సంబంధించిన కేసులను విచారించడం సుప్రీం కోర్టు చరిత్ర లోనె మొదటిసారి అవుతుంది. 1950 […]

Advertisement
Update:2019-09-21 11:45 IST

సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా… సింగిల్ జడ్జి బెంచ్ బెయిల్ పిటిషన్లను విచారించే అవకాశం ఏర్పడింది. ఇప్పటివరకు డివిజన్ బెంచ్ లేదా ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ మాత్రమే బెయిల్, బదిలీ కేసులపై విచారణ జరిపేది. ఇప్పుడు కొత్త నిబంధనలు రూపొందడం తో ఒకే న్యాయమూర్తికి ఇటువంటి కేసులను విచారించడానికి అవకాశం ఏర్పడుతున్నది. ఈ నిబంధన అమలులోకి వస్తే… ఒకే న్యాయమూర్తి బెయిల్, బదిలీ సమస్యలకు సంబంధించిన కేసులను విచారించడం సుప్రీం కోర్టు చరిత్ర లోనె మొదటిసారి అవుతుంది.

1950 నుండి ఇప్పటివరకు ఉన్న కాలం లో… మొదటిసారిగా సుప్రీం కోర్టు 34 మంది న్యాయమూర్తులను కలిగి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య కేసుల విచారణ లో జాప్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

సుప్రీంకోర్టులో 59,616 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం, “సుప్రీంకోర్టు నిబంధనలు- 2013” లోని ఆర్డర్ సిక్స్, రూల్ 1 ప్రకారం ఇద్దరు న్యాయమూర్తుల కంటే తక్కువ మంది విచారించడానికి వీలు లేదు.

‘సుప్రీంకోర్టు (ఎమెండ్ మెంట్) నిబంధనలు 2019’ ప్రకారం… సింగిల్ జడ్జి బెంచ్… ప్రత్యేక సెలవు పిటిషన్ల మంజూరీ, బెయిల్ దరఖాస్తులను తిరస్కరించడం, డిస్మిస్ చేయడం, ఏడేండ్ల జైలు శిక్ష కు అవకాశం ఉన్న… క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 437, 438 లేదా 439 కింద జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన వారి ముందస్తు బెయిల్ దరఖాస్తుల విచారణ వంటి వాటిని చేపట్టవచ్చు.

సి.ఆర్.పి.సి సెక్షన్ 25 ప్రకారం… సివిల్ సూట్లు, క్రిమినల్ కేసులను ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు బదిలీ చేసే కేసులను నిర్ణయించడానికి సింగిల్ జడ్జిని భారత ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేస్తారు. ఈ కేసులను కూడా సింగిల్ జడ్జి బెంచీలు నిర్ణయించవచ్చు.

Tags:    
Advertisement

Similar News