రెండు రాష్ట్రాలు, హుజుర్‌నగర్‌కు ఎన్నికల షెడ్యూల్ విడుదల

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 21న రెండు రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. అదే నెల 24న కౌంటింగ్ ఉంటుంది. సెప్టెంబర్ 27న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. రెండు రాష్ట్రాల్లోనూ ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. వీటితో పాటు తెలంగాణలోని హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక కూడా అక్టోబర్ 21నే జరుగుతుంది. ఫలితం 24న బయటకు వస్తుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 64 స్థానాలకు కూడా […]

Advertisement
Update:2019-09-21 07:37 IST

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 21న రెండు రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. అదే నెల 24న కౌంటింగ్ ఉంటుంది. సెప్టెంబర్ 27న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది.

రెండు రాష్ట్రాల్లోనూ ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. వీటితో పాటు తెలంగాణలోని హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక కూడా అక్టోబర్ 21నే జరుగుతుంది. ఫలితం 24న బయటకు వస్తుంది.

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 64 స్థానాలకు కూడా అక్టోబర్ 21నే పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈనెల 23న విడుదలవుతుంది. 30 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉంటుంది. అక్టోబర్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు.

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. 8.94 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి నవంబర్‌ 9తో ముగుస్తోంది. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ 1.82 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. హర్యానా అసెంబ్లీ కాలపరిమితి నవంబర్‌ 2తో ముగుస్తుంది.

Tags:    
Advertisement

Similar News