వాల్మీకి ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు

వరుణ్ తేజ్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. పైగా ఈ ఏడాది ఎఫ్2 రూపంలో భారీ హిట్ కొట్టాడు. అతడి మార్కెట్ పెరిగింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ వాల్మీకి సినిమా. మీడియం రేంజ్ బడ్జెట్ లో తీసిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 20 కోట్ల రూపాయలకు అమ్మారు. వరల్డ్ వైడ్ చూసుకుంటే 25 కోట్ల రూపాయలకు ఈ సినిమాను అమ్మారు. హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కావడం, సూపర్ హిట్ సినిమాకు […]

Advertisement
Update:2019-09-17 11:00 IST

వరుణ్ తేజ్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. పైగా ఈ ఏడాది ఎఫ్2 రూపంలో భారీ హిట్ కొట్టాడు. అతడి మార్కెట్ పెరిగింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ వాల్మీకి సినిమా. మీడియం రేంజ్ బడ్జెట్ లో తీసిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 20 కోట్ల రూపాయలకు అమ్మారు. వరల్డ్ వైడ్ చూసుకుంటే 25 కోట్ల రూపాయలకు ఈ సినిమాను అమ్మారు.

హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కావడం, సూపర్ హిట్ సినిమాకు రీమేక్ అవ్వడం, వరుణ్ తేజ్ గెటప్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రీ-రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది. అప్పటివరకు తటపటాయించిన వెస్ట్, గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు కూడా నిర్మాతలు చెప్పిన మొత్తాలకు అగ్రిమెంట్లు చేసుకున్నారు.

అన్నింటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. మార్కెట్ తక్కువగా ఉన్న నెల్లూరు ఏరియాలో ఈ సినిమా 75 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. మొత్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అటుఇటుగా 22 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 7.40 కోట్లు
సీడెడ్ – రూ. 3.35 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.40 కోట్లు
ఈస్ట్ – రూ. 1.60 కోట్లు
వెస్ట్ – రూ. 1.10 కోట్లు
గుంటూరు – రూ. 1.80 కోట్లు
నెల్లూరు – రూ. 0.75 కోట్లు
కృష్ణా – రూ. 1.60 కోట్లు

Tags:    
Advertisement

Similar News