అప్పుడు రజనీకాంత్.... ఇప్పుడు రామ్ చరణ్ వల్ల ఆగిపోయాను

భారత చలన చిత్ర పరిశ్రమ లో ఎంతో మంది గొప్ప ఛాయాగ్రాహకులు ఉన్నారు…. కానీ అందులో కేవలం కొంతమంది మాత్రమే ప్రత్యేకతను సంపాదించుకున్నారు. రత్నవేలు అందులో మొదటి వరుస లో ఉంటాడు. పెద్ద పెద్ద సినిమాలకి పని చేసిన అనుభవం ఉన్న రత్నవేలు… క్వాలిటీ అవుట్ పుట్ కోసం ఎక్కడా వెనక్కి తగ్గకుండా కష్టపడతాడని పేరుంది. అయితే రత్నవేలు దర్శకుడి గా మారాలనుకోని ఒక కథ ని కూడా సిద్ధం చేసుకున్నాడట… కానీ కొన్ని కారణాల వల్ల […]

Advertisement
Update:2019-09-17 08:28 IST

భారత చలన చిత్ర పరిశ్రమ లో ఎంతో మంది గొప్ప ఛాయాగ్రాహకులు ఉన్నారు…. కానీ అందులో కేవలం కొంతమంది మాత్రమే ప్రత్యేకతను సంపాదించుకున్నారు. రత్నవేలు అందులో మొదటి వరుస లో ఉంటాడు. పెద్ద పెద్ద సినిమాలకి పని చేసిన అనుభవం ఉన్న రత్నవేలు… క్వాలిటీ అవుట్ పుట్ కోసం ఎక్కడా వెనక్కి తగ్గకుండా కష్టపడతాడని పేరుంది.

అయితే రత్నవేలు దర్శకుడి గా మారాలనుకోని ఒక కథ ని కూడా సిద్ధం చేసుకున్నాడట… కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

ఈ విషయమై ఇటీవల రత్నవేలు ఓపెన్ అయ్యారు. “ఏడేళ్ల క్రితం దర్శకత్వం చేద్దాం అనుకుంటున్నప్పుడు రజనీకాంత్ సినిమా రావడం తో ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాను. ఆ తర్వాత బిజీ అయిపోయాను. మళ్ళీ దర్శకత్వం చేయాలి అనుకున్నప్పుడు రామ్ చరణ్ సై రా ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి… నీ అవసరం ఇండస్ట్రీ కి ఉంది, అప్పుడే ఆ నిర్ణయం తీసుకోవద్దు అని అన్నారు. అలా మళ్ళీ నా దర్శకత్వ ఆలోచనలు ఆగిపోయాయి” అని రత్నవేలు చెప్పుకొచ్చాడు.

Tags:    
Advertisement

Similar News