కోడెల "పల్నాటి పులి" ఎలా అవుతాడు? పులులు 'ఫర్నీచర్' ఎత్తుకెళ్తాయా? 'కే ట్యాక్స్' వసూలు చేస్తాయా?
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యను చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని బీజేపీ నేత లక్ష్మీపతిరాజ మండిపడ్డారు. కోడెల శివప్రసాదరావు పల్నాటి పులి ఎలా అవుతారని ప్రశ్నించారు. స్వయంగా చంద్రబాబే ఇలా పులి అనడం సరికాదన్నారు. చంద్రబాబు… పార్టీలో పులులను, సింహాలను పెంచుతున్నారా అని ప్రశ్నించారు. ఇలా పులులను, సింహాలను పెంచి ప్రజలపైకి వదులుతారా? అని నిలదీశారు. పులులు ఎక్కడైనా అవినీతి చేస్తాయా ? పులులు కే ట్యాక్స్ వసూలు చేస్తాయా? పులులు అసెంబ్లీ ఫర్నిచర్‌ను ఎత్తుకెళ్తాయా? అని […]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యను చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని బీజేపీ నేత లక్ష్మీపతిరాజ మండిపడ్డారు. కోడెల శివప్రసాదరావు పల్నాటి పులి ఎలా అవుతారని ప్రశ్నించారు. స్వయంగా చంద్రబాబే ఇలా పులి అనడం సరికాదన్నారు. చంద్రబాబు… పార్టీలో పులులను, సింహాలను పెంచుతున్నారా అని ప్రశ్నించారు. ఇలా పులులను, సింహాలను పెంచి ప్రజలపైకి వదులుతారా? అని నిలదీశారు.
పులులు ఎక్కడైనా అవినీతి చేస్తాయా ? పులులు కే ట్యాక్స్ వసూలు చేస్తాయా? పులులు అసెంబ్లీ ఫర్నిచర్‌ను ఎత్తుకెళ్తాయా? అని లక్ష్మీపతిరాజ ప్రశ్నించారు. కోడెల మీద కేసులు పెట్టింది జగన్‌మోహన్ రెడ్డో, అంబటి రాంబాబో కాదని… స్వయంగా సత్తనపల్లి, నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు, టీడీపీ నేతలే కోడెల కుటుంబం మీద కేసులు పెట్టారని…. అలాంటప్పుడు అవి ప్రభుత్వ వేధింపులు ఎలా అవుతాయని ప్రశ్నించారు.
కోడెల కే ట్యాక్స్ దెబ్బకు రెండు నియోజకవర్గాల ప్రజలు వణికిపోతున్నప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. వంగవీటి రంగా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి కోడెల అని గుర్తు చేశారు.
కోడెల ఆత్మహత్యపై సంయమనం పాటించి…. సంతాపానికి మాత్రమే చంద్రబాబు, టీడీపీ పరిమితమై ఉంటే కోడెల స్థాయిని పెంచినట్టు అయ్యేదన్నారు. అలా కాకుండా దీన్ని కూడా రాజకీయం చేయడం ద్వారా కోడెల చేసిన దందాలపై చర్చకు అవకాశం ఇచ్చినట్టు అయిందన్నారు.
అవినీతిపరులపై కేసులు పెట్టాల్సిందేనని… వాటిని వేధింపులు అంటూ తప్పించుకునేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు లక్ష్మీపతిరాజ .