మొన్న మహేష్ తో... ఇప్పుడు నాని తో రీఎంట్రీ ?

టాలీవుడ్ లో కమెడియన్ గా అడుగు పెట్టి…. కాలం కలిసొచ్చి నిర్మాత స్థాయి కి ఎదిగాడు బండ్ల గణేష్. రాజకీయాలతో నటనకు దూరంగా ఉన్న గణేష్… ఇప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి రీఎంట్రీ ఇచ్చాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు నిర్మాత గా కూడా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడట గణేష్. ఒకప్పుడు పెద్ద హీరోలు, పెద్ద దర్శకులతోనే సినిమా లు చేస్తానని చెప్పిన బండ్ల…. ఇప్పుడు తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న […]

Advertisement
Update:2019-09-17 09:52 IST
మొన్న మహేష్ తో... ఇప్పుడు నాని తో రీఎంట్రీ ?
  • whatsapp icon

టాలీవుడ్ లో కమెడియన్ గా అడుగు పెట్టి…. కాలం కలిసొచ్చి నిర్మాత స్థాయి కి ఎదిగాడు బండ్ల గణేష్. రాజకీయాలతో నటనకు దూరంగా ఉన్న గణేష్… ఇప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి రీఎంట్రీ ఇచ్చాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు.

అయితే ఇప్పుడు నిర్మాత గా కూడా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడట గణేష్. ఒకప్పుడు పెద్ద హీరోలు, పెద్ద దర్శకులతోనే సినిమా లు చేస్తానని చెప్పిన బండ్ల…. ఇప్పుడు తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం.. బండ్ల గణేష్ త్వరలోనే నానితో ఒక సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడని చెబుతున్నారు. అయితే ఈ సినిమా కి దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియదు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన పనులను మాత్రం సైలెంట్ గా ఎప్పుడో మొదలుపెట్టినట్లు కూడా చెబుతున్నాయి సినిమా వర్గాలు. అన్ని సెట్ అయ్యాక ఈ సినిమా కి సంబందించిన వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందంటున్నారు.

Tags:    
Advertisement

Similar News