ఎన్ని కేసులు పడినా టైటిల్ మార్చరంట

రిలీజ్ కు ఇంకా 5 రోజులు మాత్రమే టైం ఉంది. మరి వాల్మీకి పరిస్థితేంటి? ఈ సినిమా టైటిల్ మారుస్తారా? ఆఖరి నిమిషంలో టైటిల్ మారిస్తే అది సినిమాపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. దీంతో వాల్మీకిపై పుకార్లు ఓ రేంజ్ లో షికారు చేస్తున్నాయి. ఎట్టకేలకు వీటిపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. తమ సినిమాకు పేరు మార్చే ఉద్దేశం లేదని స్పష్టంచేశాడు. వాల్మీకి తెగను తాము కించపరచడం లేదంటున్నాడు హరీష్. ఆ తెగ మనోభావాలు […]

Advertisement
Update:2019-09-15 08:30 IST

రిలీజ్ కు ఇంకా 5 రోజులు మాత్రమే టైం ఉంది. మరి వాల్మీకి పరిస్థితేంటి? ఈ సినిమా టైటిల్ మారుస్తారా? ఆఖరి నిమిషంలో టైటిల్ మారిస్తే అది సినిమాపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. దీంతో వాల్మీకిపై పుకార్లు ఓ రేంజ్ లో షికారు చేస్తున్నాయి. ఎట్టకేలకు వీటిపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. తమ సినిమాకు పేరు మార్చే ఉద్దేశం లేదని స్పష్టంచేశాడు.

వాల్మీకి తెగను తాము కించపరచడం లేదంటున్నాడు హరీష్. ఆ తెగ మనోభావాలు దెబ్బతీసేలా సినిమాలో ఒక్క సన్నివేశం కూడా ఉండదని, ప్రస్తుతం కోర్టుల చుట్టుూ తిరుగుతున్న బోయ తెగ వ్యక్తులు, వాల్మీకి సినిమా చూసిన తర్వాత మాట్లాడాలని చెబుతున్నాడు. కథకు తగ్గట్టుగానే టైటిల్ ఫిక్స్ చేశామని, వాల్మీకి అనే పాత్రను ఎక్కడా నెగెటివ్ గా చూపించలేదని కూడా చెబుతున్నాడు.

అంతేకాదు.. మరోవైపు టైటిల్ నుంచి తుపాకీ గుర్తును తీసేయడానికి కూడా నిరాకరించాడు హరీష్. సినిమాలో గ్యాంగ్ స్టర్ నేపథ్యం ఉందని, సినిమా బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంటుందని.. అందుకే టైటిల్ లో తుపాకి, ఫిలింరీల్ ను ఉంచామని.. అది మనోభావాల్ని కించపరిచినట్టు ఎలా అవుతుందని స్పష్టంచేశాడు.

ప్రస్తుతం ఈ తెగకు చెందిన కొందరు వ్యక్తులు హైకోర్టులో కేసు వేశారు. డీజీపీ, సెన్సార్ బోర్డ్, ఫిలింఛాంబర్ తో పాటు వరుణ్ తేజ్ కు నిర్మాతలకు నోటీసులు ఇచ్చారు. మరో 3 రోజుల్లో ఈ వ్యవహారం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News