బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా మల్లాది విష్ణు !
తన పాలనతో ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పదవుల పందారంలోనూ ఎలాంటి వెనుకడుగు వేయడం లేదు. ఇందులో భాగంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు మల్లాది విష్ణుకు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండురోజుల క్రితం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ లు, కార్పొరేషన్ లోని ఇతర డైరెక్టర్ల పదవులను తక్షణమే భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని […]
తన పాలనతో ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పదవుల పందారంలోనూ ఎలాంటి వెనుకడుగు వేయడం లేదు. ఇందులో భాగంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు మల్లాది విష్ణుకు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండురోజుల క్రితం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ లు, కార్పొరేషన్ లోని ఇతర డైరెక్టర్ల పదవులను తక్షణమే భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇప్పటికే కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిని మల్లాది విష్ణుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మల్లాది విష్ణు నియామకంపై ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందంటున్నారు. విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి అనుంగు అనుచరుడుగా వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడమే కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి మధ్య ఆయన వారధిలా పనిచేశారు. దీంతో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిని మల్లాది విష్ణుకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు చెబుతున్నారు.