సీఎం రమేష్, నవయుగకు షాకిచ్చిన జగన్
టీడీపీకి, ఆ పార్టీ మాజీ ఎంపీ సీఎం రమేష్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని ప్రాజెక్టుల కాంట్రాక్టులను గుప్పిట పట్టిన టీడీపీ మాజీ ఎంపీ సీఎం రమేష్ కు ఇప్పుడు జగన్ సర్కారు భారీ షాకిచ్చింది. చంద్రబాబు హయాంలో భారీగా అంచనాలు పెంచేసుకొని చేపట్టిన గాలేరు-నగరి ఫేజ్ 2 పనులను జగన్ సర్కారు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక వెంటనే రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయించింది. […]
టీడీపీకి, ఆ పార్టీ మాజీ ఎంపీ సీఎం రమేష్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని ప్రాజెక్టుల కాంట్రాక్టులను గుప్పిట పట్టిన టీడీపీ మాజీ ఎంపీ సీఎం రమేష్ కు ఇప్పుడు జగన్ సర్కారు భారీ షాకిచ్చింది.
చంద్రబాబు హయాంలో భారీగా అంచనాలు పెంచేసుకొని చేపట్టిన గాలేరు-నగరి ఫేజ్ 2 పనులను జగన్ సర్కారు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక వెంటనే రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ చేపట్టిన టీడీపీ మాజీ ఎంపీ సీఎం రమేష్ కు ఇది భారీ షాకే అంటున్నారు.
టీడీపీ హయాంలో గాలేరు-నగరి ప్రాజెక్ట్ ని 794 కోట్లకు… కాంట్రాక్టర్లు పోటీకి రాకుండా మేనేజ్ చేసి అధికరేట్లకు సీఎం రమేష్ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి వారం ముందే టీడీపీ ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టడంపై విమర్శలు వచ్చాయి. ఇందులో భారీగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయినట్టు ఆరోపణలున్నాయి.
దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం టెండర్లను రద్దు చేస్తూ కొత్తగా రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనివల్ల భారీగా ప్రజాధనం ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇక బుధవారం ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ పనులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపడం విశేషం. పనుల నిర్వహణకు కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్స్ లను రికవరీ చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
దీంతో చంద్రబాబు హయాంలో నవయుగ కంపెనీకి కట్టబెట్టిన…. పోలవరం కాంట్రాక్ట్, 3,216 కోట్ల డబ్బును వెనక్కి తీసుకుంటారా? పనులు పోనూ మిగతావాటిని రికవరీ చేస్తారా? అన్నది వేచిచూడాలి.