ఇవాళ్టి నుంచి అసలు లెక్క బయటపడుతుంది

ప్రచారం ఊదరగొట్టారు. భారీగా థియేటర్లు పట్టారు. టిక్కెట్ రేట్లు పెంచారు. సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేశారు. ఫలితంగా సాహో చుట్టూ ఓ రకమైన మాయా ప్రపంచం అల్లుకుంది. దీనికి తోడు ఫెస్టివల్ సీజన్ కూడా కావడంతో వసూళ్లు భారీగా వచ్చాయి. నిన్నటివరకు సాహోపై జరిగిన హంగామా అంతా ఒకెత్తు. ఇవాళ్టి నుంచి జరగబోయేది మరో ఎత్తు. అవును.. సాహో అసలు లెక్క ఇవాళ్టి నుంచి బయటపడుతుంది. సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేసింది. చాలామంది బాగాలేదన్నారు. లార్గో […]

Advertisement
Update:2019-09-03 09:17 IST

ప్రచారం ఊదరగొట్టారు. భారీగా థియేటర్లు పట్టారు. టిక్కెట్ రేట్లు పెంచారు. సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేశారు. ఫలితంగా సాహో చుట్టూ ఓ రకమైన మాయా ప్రపంచం అల్లుకుంది. దీనికి తోడు ఫెస్టివల్ సీజన్ కూడా కావడంతో వసూళ్లు భారీగా వచ్చాయి. నిన్నటివరకు సాహోపై జరిగిన హంగామా అంతా ఒకెత్తు. ఇవాళ్టి నుంచి జరగబోయేది మరో ఎత్తు. అవును.. సాహో అసలు లెక్క ఇవాళ్టి నుంచి బయటపడుతుంది.

సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేసింది. చాలామంది బాగాలేదన్నారు. లార్గో వించ్ ను కాపీకొట్టారని ఆరోపించారు. బాలీవుడ్ సైడ్ నుంచి అయితే క్రిటిక్స్ విరుచుకుపడ్డారు. అయితే ఈ 4 రోజుల వసూళ్లతో అవన్నీ తేలిపోయాయి. నిజంగా సినిమా హిట్టా, ఫ్లాప్ అనే విషయం ఇవాళ్టి నుంచి వచ్చే వసూళ్ల ఆధారంగా తెలుస్తుంది. ఇవాళ్టి నుంచి ఫుల్ వర్కింగ్ డేస్ మొదలయ్యాయి. ఇప్పుడు కూడా సాహోకు హౌజ్ ఫుల్స్ వస్తే నిజంగా హిట్ అయినట్టే. లేకపోతే మాత్రం ఈ వీకెండ్ నాటికి సినిమా పూర్తిగా చతికిలపడిపోతుంది.

ఇక నిన్నటితో కలిపి 4 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ లో 3 మిలియన్ మార్క్ కు దగ్గరైన ఈ సినిమా, బాలీవుడ్ లో వంద కోట్ల మార్క్ కు దగ్గరగా ఉంది. నార్త్ లో ఈ సినిమాకు 93 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సాహోకు 67 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఏపీ,నైజాంలో ఈ సినిమాకు వచ్చిన 4 రోజుల షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 23.30 కోట్లు
సీడెడ్ – రూ 9.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 7.87 కోట్లు
ఈస్ట్ – రూ. 6.30 కోట్లు
వెస్ట్ – రూ. 4.90 కోట్లు
గుంటూరు – రూ. 7.09 కోట్లు
నెల్లూరు – రూ. 3.58 కోట్లు
కృష్ణా – రూ. 4.50 కోట్లు

Tags:    
Advertisement

Similar News