భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్
అలీపూర్ కోర్టులో షమీపై గృహహింస కేసు 15 రోజుల్లోగా లొంగిపోవాలంటూ కోర్టు ఆదేశం నెలరోజుల కరీబియన్ టూర్లో చక్కగా రాణించిన భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయింది. షమీని 15 రోజుల్లోగా లొంగిపోవాలంటూ కోల్ కతాలోని అలీపూర్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. తాను ప్రేమించి పెళ్లాడిన చీర్ గాళ్ హసీన్ జమాన్ ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత షమీపై వేధింపుల కేసు పెట్టింది. తన భర్త షమీతో కలసి అత్తింటివారు […]
- అలీపూర్ కోర్టులో షమీపై గృహహింస కేసు
- 15 రోజుల్లోగా లొంగిపోవాలంటూ కోర్టు ఆదేశం
నెలరోజుల కరీబియన్ టూర్లో చక్కగా రాణించిన భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయింది. షమీని 15 రోజుల్లోగా లొంగిపోవాలంటూ కోల్ కతాలోని అలీపూర్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.
షమీ వివాహేతర సంబంధాలతో తనను మానసికంగా వేధిస్తున్నాడని, దుబాయ్ లో వేరే యువతితో కాపురం పెట్టాడని..అదేమిటని నిలదీస్తే…హింసిస్తున్నట్లు హసీన్ తన ఫిర్యాదులో పేర్కొంది.
కోల్ కతా లోని అలీపూర్ స్టేడిషన్లో షమీపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు.
బీసీసీఐ ఆచితూచి…
అరెస్టు వారెంట్ జారీ తో ఉక్కిరిబిక్కిరవుతున్న మహ్మద్ షమీపై తాము ఇప్పటికిప్పుడే చర్యతీసుకొనే అవకాశం లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది.
షమీపై నమోదైన ఎఫ్ఐఆర్ ను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే చర్య తీసుకొంటామని బీసీసీఐ ప్రతినిధి వివరించారు.
మొత్తం మీద..రచ్చ గెలిచినా ఇంటగెలవలేకపోయిన మహ్మద్ షమీకి..ఇంతిపోరు ఇంతింత కాదయ్యా అన్నమాట చక్కగా వర్తిస్తుంది.
కరీబియన్ టూర్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే షమీ కోర్టు ముందు లొంగిపోయి బెయిల్ కు దరఖాస్తు చేసుకోడమో లేదా… హైకోర్టుకు వెళ్లడమే చేసే అవకాశం ఉంది.