లోకల్‌లో ఇబ్బందులున్నాయి.. అందుకే బీజేపీలో చేరుతున్నా...

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను మించిన మొనగాళ్లు లేరని తొడలు కొట్టిన నేతలు అధికారం పోయిన రెండు నెలలకే అతలాకుతలం అవుతున్నారు. షెల్టర్ జోన్ కోసం వెతుకుతున్నారు. టీడీపీ హయాంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న వారు ప్రస్తుత తరుణంలో బీజేపీ మాత్రమే తమకు సేఫ్‌ అని భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన కీలక నేతలు, చంద్రబాబు ఆత్మలు కూడా బీజేపీలో చేరిపోయారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా ఇప్పుడు జంప్ చేస్తున్నారు. బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. స్థానికంగా […]

Advertisement
Update:2019-09-01 11:40 IST

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను మించిన మొనగాళ్లు లేరని తొడలు కొట్టిన నేతలు అధికారం పోయిన రెండు నెలలకే అతలాకుతలం అవుతున్నారు. షెల్టర్ జోన్ కోసం వెతుకుతున్నారు. టీడీపీ హయాంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న వారు ప్రస్తుత తరుణంలో బీజేపీ మాత్రమే తమకు సేఫ్‌ అని భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన కీలక నేతలు, చంద్రబాబు ఆత్మలు కూడా బీజేపీలో చేరిపోయారు.

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా ఇప్పుడు జంప్ చేస్తున్నారు. బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. స్థానికంగా ఒత్తిడి ఉందని… స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే తాను బీజేపీలో చేరుతున్నట్టు ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. త్వరలోనే చేరిక ముహూర్తం వెల్లడిస్తానని చెప్పారు. ఇటీవలే ఆదినారాయణరెడ్డి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను కూడా కలిశారు.

2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డి ఆ తర్వాత చంద్రబాబు పంచన చేరారు. మంత్రి అయ్యారు. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి కంటే ఆదినారాయణరెడ్డికే పెద్దపీట వేస్తూ వచ్చారు చంద్రబాబు. నియోజకవర్గంలో పనులను 50-50గా పంచుకోవాలని చంద్రబాబు పంచాయతీ కూడా చేశారు.

అయితే ఇప్పుడు ఆదినారాయణరెడ్డి టీడీపీకి హ్యాండ్ ఇచ్చి బీజేపీలోకి వెళ్లిపోతున్నారు. జగన్‌కు వెన్నుపోటు పొడిచిన ఆదినారాయణరెడ్డికి పెద్దపీట వేసినందుకు చంద్రబాబుకు తగిన శాస్తే జరిగిందని రామసుబ్బారెడ్డి వర్గం అంటోంది.

Tags:    
Advertisement

Similar News