సతీష్ మృతదేహాన్ని ముక్కలు చేసే ప్రయత్నం

హైదరాబాద్‌లో హత్యకు గురైన సాప్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ బాబు కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సతీష్‌ను హత్య చేసింది అతడి స్నేహితుడు హేమంతేనని పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారంలో ప్రియాంక అనే యువతి పాత్ర కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. సతీష్, హేమంత్‌ ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఆర్థిక విభేదాలతో పాటు… వివాహేతర సంబంధం కూడా హత్యకు కారణమని భావిస్తున్నారు. ప్రియాంక, సతీష్ ఇద్దరూ సన్నిహితంగా […]

Advertisement
Update:2019-08-31 05:00 IST

హైదరాబాద్‌లో హత్యకు గురైన సాప్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ బాబు కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సతీష్‌ను హత్య చేసింది అతడి స్నేహితుడు హేమంతేనని పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారంలో ప్రియాంక అనే యువతి పాత్ర కూడా ఉన్నట్టు భావిస్తున్నారు.

సతీష్, హేమంత్‌ ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఆర్థిక విభేదాలతో పాటు… వివాహేతర సంబంధం కూడా హత్యకు కారణమని భావిస్తున్నారు.

ప్రియాంక, సతీష్ ఇద్దరూ సన్నిహితంగా ఉంటారని.. ఆ కోపంతోనే హేమంత్‌ హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో ఒక మహిళ అక్కడ ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

హత్య చేసిన తర్వాత సతీష్ మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికి ప్లాస్టిక్ కవర్లలో తరలించేందుకు హేమంత్ ప్రయత్నించినట్టు సంఘటన స్థలిలోని పరిస్థితిని బట్టి తెలుస్తోంది. సతీష్‌ గొంతు కోసి హత్య చేసిన తర్వాత అతడి శరీరాన్ని ముక్కలు చేసే ప్రయత్నం జరిగింది. కుడికాలిని మోకాలు భాగం వరకు వేరు చేశారు. గదిలో పెద్ద ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, పెద్ద టీవీ పెట్టె ఉంది. దీన్ని బట్టి మృతదేహాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ కవర్లలో వేసి మాయం చేసేందుకు హంతకుడు ప్రయత్నించినట్టు భావిస్తున్నారు.

కానీ ఈ ప్రయత్నాన్ని మధ్యలోనే వదిలేసి గదికి తాళం వేసుకుని ఫోన్ స్విచ్చాప్ చేసుకుని హేమంత్ పారిపోయాడు. సతీష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలిస్తూ హేమంత్ గదికి వెళ్లగా అక్కడ దుర్వాసన వచ్చింది. దాంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది.

ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన మైలా సతీష్‌బాబు, భీమవరానికి చెందిన హేమంత్‌ కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. విదేశాల్లో ఎంఎస్‌ పూర్తి చేసి వచ్చిన సతీష్‌బాబు.. ఏడాది క్రితం హేమంత్‌తో కలసి కేపీహెచ్‌బీ కాలనీలోని 7వ ఫేజ్‌లో ఐటీ స్లేట్‌ కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సాప్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సంస్థను ఏర్పాటు చేశాడు.

సతీష్‌బాబు తన భార్య ప్రశాంతితో కలిసి మూసాపేట ఆంజనేయ నగర్‌లో ఉంటున్నాడు. హేమంత్‌ కుటుంబం ఆల్వాల్‌లో నివాసం ఉంటుండగా, అతను కేపీహెచ్‌బీలోని 7వ ఫేజ్‌లో ఇళ్లు అద్దెకు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు.

Tags:    
Advertisement

Similar News