టీడీపీ ప్రజల కోసం కాదు.. ఒక సామాజికవర్గం కోసం పనిచేస్తోంది
తెలుగుదేశం పార్టీకి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నేత వరుపుల రాజా రాజీనామా చేశారు. టీడీపీలో ఇతర వర్గాలకు విలువ లేదని వ్యాఖ్యానించారు. టీడీపీలోని 80 శాతం కాపు నేతలు అసంతృప్తితో ఉన్నారని… వారంతా త్వరలోనే పార్టీ వీడే అవకాశం ఉందన్నారు. టీడీపీలో కాపులు ఎంత కష్టపడి పనిచేసినా మనుగడ ఉండదని తేలిందన్నారు. ఒక సామాజికవర్గానికి మాత్రమే టీడీపీ కొమ్ము కాస్తోందన్నారు. ఆ సామాజికవర్గం వారు ఏమి చెబితే అదే టీడీపీలో జరుగుతుందన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు […]
తెలుగుదేశం పార్టీకి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నేత వరుపుల రాజా రాజీనామా చేశారు. టీడీపీలో ఇతర వర్గాలకు విలువ లేదని వ్యాఖ్యానించారు. టీడీపీలోని 80 శాతం కాపు నేతలు అసంతృప్తితో ఉన్నారని… వారంతా త్వరలోనే పార్టీ వీడే అవకాశం ఉందన్నారు.
టీడీపీలో కాపులు ఎంత కష్టపడి పనిచేసినా మనుగడ ఉండదని తేలిందన్నారు. ఒక సామాజికవర్గానికి మాత్రమే టీడీపీ కొమ్ము కాస్తోందన్నారు. ఆ సామాజికవర్గం వారు ఏమి చెబితే అదే టీడీపీలో జరుగుతుందన్నారు.
ఐదేళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు కాపులకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేదని ప్రశ్నించారు. జగన్ ఎన్నికలు ముందు చెప్పిన స్టాండ్ మీదే ఇప్పుడు కూడా ఉన్నారన్నారు. టీడీపీ ఒక మునిగిపోయే పడవ అని వరుపుల వ్యాఖ్యానించారు.
చంద్రబాబు మాట ఇస్తే దానిపై నిలబడుతారని నమ్మే వారు టీడీపీలోనే లేరన్నారు. రాష్ట్ర ప్రజల అవసరాలు ఏమిటి అన్నది గుర్తించే ఆలోచన టీడీపీ నాయకత్వంలో లేదన్నారు.
కేవలం ఒక సామాజికవర్గం కోసం మాత్రమే టీడీపీ పనిచేస్తోందన్నారు. జిల్లాలో తక్కువ మెజారిటీతో తాను ఓడిపోయానన్నారు. ఒక నెల రోజుల్లో కార్యకర్తలతో చర్చించి ఏ పార్టీలో చేరాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
మూడు నెలల పాలనలోనే జగన్ అది చేయడం లేదు… ఇది చేయడం లేదని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారేగానీ… జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నారన్న విషయం ప్రజలకు అర్ధమైందన్నారు.