'బందోబస్త్' వివాదం.... కోర్టు విచారణ వాయిదా

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చిత్రం లో నటిస్తున్నాడు. గత కొద్ది కాలంగా తన సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ఇంతకు ముందు శ్రీ రాఘవ దర్శకత్వం లో వచ్చిన సినిమా కూడా తెలుగు లో పెద్దగా ఆడలేదు. ఈ నేపథ్యం లో సూర్య ప్రస్తుతం ‘కాప్పాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో ‘బందోబస్త్’ అనే పేరుతో అనువదించి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ […]

Advertisement
Update:2019-08-28 05:13 IST

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చిత్రం లో నటిస్తున్నాడు. గత కొద్ది కాలంగా తన సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ఇంతకు ముందు శ్రీ రాఘవ దర్శకత్వం లో వచ్చిన సినిమా కూడా తెలుగు లో పెద్దగా ఆడలేదు.

ఈ నేపథ్యం లో సూర్య ప్రస్తుతం ‘కాప్పాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో ‘బందోబస్త్’ అనే పేరుతో అనువదించి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

అయితే ఈ సినిమా కి తెలుగు లో పెద్దగా క్రేజ్ రాలేదు. బిజినెస్ కూడా జరగలేదు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అంతా సవ్యం గా సాగుతుంది అనుకుంటున్న సమయం లో ఇప్పుడు ఈ సినిమా కథ విషయమై ఒక వివాదం తలెత్తింది. ఈ సినిమా కథ తనదంటూ జాన్ చార్లెస్ అనే వ్యక్తి చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కథ వివాదం పరిష్కారం అయ్యే వరకు ఈ సినిమా విడుదల అవ్వకుండా చూడాలని కోర్టును కోరాడు. అయితే జాన్ అనే ఈ వ్యక్తి… ఎప్పటి నుంచో సినిమా పరిశ్రమ లో ఉంటూ తన కథని చాలా మంది దర్శకులకి చెప్పానని, అందులో భాగం గా ఈ సినిమా దర్శకుడు కె వి ఆనంద్ కు కూడా చెప్పానని పేర్కొన్నాడు. అయితే ఈ కేసు విచారణ వచ్చే నెల 4 వ తేదీ కి వాయిదా పడింది.

Tags:    
Advertisement

Similar News