నాని... 'గ్యాంగ్ లీడర్' ట్రైలర్

‘జెర్సీ’ వంటి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాతో హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ అనే కామెడీ ఎంటర్ టైనర్ సినిమాతో త్వరలో తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నాడు. విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం కానుంది. ‘ఆర్ ఎక్స్ 100’ కార్తికేయ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టీజర్ ప్రేక్షకులకు సినిమాపై అంచనాలను పెంచగా తాజాగా […]

Advertisement
Update:2019-08-28 06:28 IST

‘జెర్సీ’ వంటి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాతో హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ అనే కామెడీ ఎంటర్ టైనర్ సినిమాతో త్వరలో తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నాడు.

విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం కానుంది.

‘ఆర్ ఎక్స్ 100’ కార్తికేయ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టీజర్ ప్రేక్షకులకు సినిమాపై అంచనాలను పెంచగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పెన్సిల్ పార్థసారథి పాత్రలో నాచురల్ స్టార్ నాని… అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. పేరుకి రివెంజ్ రైటర్ అనే కానీ నాని కి రివెంజ్ గురించి ఏమి తెలీదు. కానీ అతని నుండి సహాయం కోసం ఐదుగురు ఆడవాళ్లు అతనిని ఆశ్రయిస్తారు. మరి నాని ఎం చేస్తాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ముఖ్యంగా చిరు మాస్క్ వేసుకుని నాని నడిచొచ్చే సీన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

‘జెర్సీ’ సినిమాకి సంగీతాన్ని అందించిన అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల 13వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

Tags:    
Advertisement

Similar News