మళ్లీ తెరపైకి కేటీఆర్‌, హరీష్‌రావు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కీలక మార్పులు జరగబోతున్నాయి. ప్రభుత్వంలో వేగం పెంచేందుకు తిరిగి కేటీఆర్‌, హరీష్‌రావును కేబినెట్‌లోకి తీసుకునేందుకు కేసీఆర్ దాదాపు నిర్ణయించుకున్నారు. మరో వారం, పది రోజుల్లో టీ కేబినెట్‌ విస్తరణ ఉండబోతుందని చెబుతున్నారు. కేటీఆర్‌కు ఐటీ శాఖను అప్పగిస్తారని చెబుతున్నారు. హరీష్‌రావుకు పట్టణాభివృద్ధి శాఖను అప్పగించే చాన్స్ ఉంది. వీరిద్దరితో పాటు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గుత్తా, సబితాకు స్థానం కల్పించేందుకు ఇప్పుడున్న క్యాబినెట్ లోని ఇద్దరిని […]

Advertisement
Update:2019-08-28 05:24 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కీలక మార్పులు జరగబోతున్నాయి. ప్రభుత్వంలో వేగం పెంచేందుకు తిరిగి కేటీఆర్‌, హరీష్‌రావును కేబినెట్‌లోకి తీసుకునేందుకు కేసీఆర్ దాదాపు నిర్ణయించుకున్నారు.

మరో వారం, పది రోజుల్లో టీ కేబినెట్‌ విస్తరణ ఉండబోతుందని చెబుతున్నారు. కేటీఆర్‌కు ఐటీ శాఖను అప్పగిస్తారని చెబుతున్నారు. హరీష్‌రావుకు పట్టణాభివృద్ధి శాఖను అప్పగించే చాన్స్ ఉంది.

వీరిద్దరితో పాటు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గుత్తా, సబితాకు స్థానం కల్పించేందుకు ఇప్పుడున్న క్యాబినెట్ లోని ఇద్దరిని పక్కన పెడుతారని చెబుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో కమ్మ వారికి స్థానం లేకుండా ఉంది. ఈ నేపథ్యంలో పువ్వాడ అజయ్‌కు అవకాశం ఇస్తారని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News