దసరాకు కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ.... వీళ్లకే చాన్స్

కేసీఆర్ ఈ దసరాకు మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నట్టు తాజా సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై కసరత్తు కూడా మొదలు పెట్టాడట.. ప్రస్తుతం 12 మంది మంత్రివర్గంలో కొలువు దీరారు. మరో ఆరు బెర్తులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఆ ఆరుగురు ఎవరనే ప్రశ్న తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి రేపుతోంది. అయితే కేసీఆర్ తాజాగా మంత్రివర్గంలో ఉండి అతి చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలుకబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో నలుగురు కొత్తవాళ్లకు […]

Advertisement
Update:2019-08-27 01:55 IST

కేసీఆర్ ఈ దసరాకు మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నట్టు తాజా సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై కసరత్తు కూడా మొదలు పెట్టాడట.. ప్రస్తుతం 12 మంది మంత్రివర్గంలో కొలువు దీరారు. మరో ఆరు బెర్తులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఆ ఆరుగురు ఎవరనే ప్రశ్న తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి రేపుతోంది.

అయితే కేసీఆర్ తాజాగా మంత్రివర్గంలో ఉండి అతి చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలుకబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో నలుగురు కొత్తవాళ్లకు చాన్స్ ఇస్తారని అంటున్నారు. ఇదే గనుక జరిగితే మరో నలుగురు సీనియర్లకు చాన్స్ ఉందని అంటున్నారు.

మొత్తంగా చూస్తే కేటీఆర్ , హరీష్ మంత్రివర్గంలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం.

కేసీఆర్ భావించినట్టు ఇద్దరు మహిళలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు లేవని.. సబిత ఒక్కరినే తీసుకుంటారని సమాచారం. ఈ ప్లేసులో ఇటీవలే ఎమ్మెల్సీ అయిన గుత్తా సుఖేందర్ రెడ్డిని మంత్రిగా చేస్తారని చర్చ జరుగుతోంది.

ఇక కేటీఆర్, హరీష్, సబిత, గుత్తా ఖాయంగా కాగా మరో రెండు సీట్లు.. ఇప్పుడున్న వారిలో ఇద్దరిని తొలగిస్తే మొత్తం నాలుగు మంత్రి పదవులు కొత్త వారికి వస్తాయనే చర్చ పార్టీలో సాగుతోంది. మరి కేసీఆర్ దసరాకు మంత్రివర్గ విస్తరణ చేస్తారా లేదా అన్నది వేచిచూడాలి.

Tags:    
Advertisement

Similar News