సమంత అసంతృప్తికి... వాళ్ళే కారణమట !
తెలుగు సినిమా పరిశ్రమ లో సమంత స్టార్ హీరోయిన్. అక్కినేని ఇంటికి కోడలు గా వెళ్ళిన దగ్గర నుంచి సమంత రేంజ్ కూడా పెరిగింది. అలాగే నాగార్జున కి కూడా సమంత కెరీర్ అన్నా, సక్సెస్ అన్నా ఎంతో ఇష్టం ఏర్పడ్డాయి. ఇద్దరూ మనం సినిమా లో నటించిన దగ్గర నుంచి ఎంతో ఆప్యాయత ఏర్పడింది. అందుకే సమంత కూడా నాగార్జున విజయాన్ని ఎంజాయ్ చేసేది. అందులో భాగం గా నే సమంత తన కి ఎంతో […]
తెలుగు సినిమా పరిశ్రమ లో సమంత స్టార్ హీరోయిన్. అక్కినేని ఇంటికి కోడలు గా వెళ్ళిన దగ్గర నుంచి సమంత రేంజ్ కూడా పెరిగింది.
అలాగే నాగార్జున కి కూడా సమంత కెరీర్ అన్నా, సక్సెస్ అన్నా ఎంతో ఇష్టం ఏర్పడ్డాయి. ఇద్దరూ మనం సినిమా లో నటించిన దగ్గర నుంచి ఎంతో ఆప్యాయత ఏర్పడింది. అందుకే సమంత కూడా నాగార్జున విజయాన్ని ఎంజాయ్ చేసేది. అందులో భాగం గా నే సమంత తన కి ఎంతో ఇష్టమైన స్నేహితుడు రాహుల్ రవీంద్రన్ ని నాగార్జున కి పరిచయం చేసింది. ఇద్దరూ కలిసి ఒక మంచి సినిమా చేస్తారని ఆశపడింది. అదే మన్మధుడు 2.
ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజునే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. పైగా సినిమా లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండటం, ఫ్యామిలీస్ కలిసి సినిమా చూడలేకపోవటం వంటివి సినిమా కి మైనస్ పాయింట్స్ గా మారాయి. ఇలా జరుగుతుంది అని సమంత వూహించలేకపోయింది. సినిమా ఆడకపోవడం తో అసంతృప్తి కి గురయింది. అంతే కాకుండా తనకి ఎంతో ఇష్టమైన ఆ ఇద్దరికీ విజయం అందకపోవడంతో…. బాధ లో కొన్ని రోజులు ఉందట.
మొత్తానికి ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటకి వచ్చి చైతన్య తో విహార యాత్ర కి బయల్దేరింది సమంత.