కోర్టు లో తండ్రి డ్రైవర్, తాత వాచ్ మాన్, తాను జడ్జి...
కఠిన మైన శ్రమ, దీక్షలతో నాలుగు సార్లు ప్రయత్నించి తండ్రి కన్న కలను నిజం చేశాడు ఓ తనయుడు. 26 ఏళ్ల చేతన్ బజాద్ తండ్రి ఇండోర్ జిల్లా కోర్టులో సాధారణ డ్రైవర్. తాత అదే కోర్టులో వాచ్ మాన్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు. అంటే రెండు తరాల నుంచి ఆ ఇంటికి కోర్టుతో అవినాభావ సంబంధం ఉన్నదన్న మాట. చేతన్ తండ్రి చానా కాలంగా కోర్టు జడ్జి కి ఉన్న గౌరవం, అధికారాలను చూస్తూ […]
కఠిన మైన శ్రమ, దీక్షలతో నాలుగు సార్లు ప్రయత్నించి తండ్రి కన్న కలను నిజం చేశాడు ఓ తనయుడు.
26 ఏళ్ల చేతన్ బజాద్ తండ్రి ఇండోర్ జిల్లా కోర్టులో సాధారణ డ్రైవర్. తాత అదే కోర్టులో వాచ్ మాన్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు. అంటే రెండు తరాల నుంచి ఆ ఇంటికి కోర్టుతో అవినాభావ సంబంధం ఉన్నదన్న మాట.
తాను సివిల్ జడ్జి క్లాస్-2 పరీక్ష లో ఉత్తీర్ణత సాధించి తన తండ్రి కలను నిజం చేశానని చేతన్ అన్నాడు.
మధ్యప్రదేశ్ హైకోర్ట్ విడుదల చేసిన ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్టు ప్రకారం ఒబిసి కేటగిరీ లో 13వ రాంకు సాధించాడు చేతన్. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో మొత్తం 450 మార్కులకు గాను 257.5 మార్కులు పొందాడు చేతన్.
“మా నాన్న గోవిందలాల్ బజాద్ ఇండోర్ డిస్ట్రిక్ట్ కోర్టులో డ్రైవర్. మా తాత హరిరాం బజాద్ ఇదే కోర్టు లో వాచ్ మాన్ గా రిటైర్ అయ్యాడు. తన ముగ్గురు కొడుకుల్లో ఒకరిని జడ్జి గా చూడాలనేది మా నాన్న కల. చివరికి ఆ కలను నేను నెరవేర్చాను” అని గురువారం ఒక మీడియా సంస్థ తో మాట్లాడుతూ అన్నాడు చేతన్.
లా పట్టా పొందిన చేతన్ తన నాల్గవ ప్రయత్నం లో ఈ విజయం సాధించడం గమనార్హం.