కోడెల చోరీ కేసులో.... ఏపీ అసెంబ్లీ చీఫ్ మార్షల్‌పై వేటు
అసెంబ్లీకి సంబంధించిన కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు దొంగతనంగా తన ఇంటికి తరలించిన అంశంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇలా అసెంబ్లీ సంపదను కోడెల తరలించుకు వెళ్లడానికి కొందరు అధికారులు కూడా సహరించినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఫర్నీచర్ ను అసెంబ్లీ నుంచి తరలించిన సమయంలో సీసీ కెమెరాలను కూడా ఆపేశారని గుర్తించారు. ఈ వ్యవహారంలో అసెంబ్లీ చీఫ్ మార్షల్ గణేష్‌బాబు… కోడెల శివప్రసాదరావుకు సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను […]
అసెంబ్లీకి సంబంధించిన కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు దొంగతనంగా తన ఇంటికి తరలించిన అంశంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది.
ఇలా అసెంబ్లీ సంపదను కోడెల తరలించుకు వెళ్లడానికి కొందరు అధికారులు కూడా సహరించినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఫర్నీచర్ ను అసెంబ్లీ నుంచి తరలించిన సమయంలో సీసీ కెమెరాలను కూడా ఆపేశారని గుర్తించారు.
ఈ వ్యవహారంలో అసెంబ్లీ చీఫ్ మార్షల్ గణేష్‌బాబు… కోడెల శివప్రసాదరావుకు సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను ఆక్టోపస్‌కు బదిలీ చేసింది ప్రభుత్వం. ఫర్నీచర్ చోరీపై దర్యాప్తు పూర్తయిన తర్వాత మరింత మందిపై చర్యలు ఉంటాయని చెబుతున్నారు.