ఈ ఒక్క రోజు ఖర్చు రెండున్నర కోట్లు

మరికొన్ని గంటల్లో సాహో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. రామోజీ ఫిలిసిటీలో ఈ ఫంక్షన్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. కేవలం ఈ ఒక్క ఈవెంట్ కోసమే 2 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. సినిమాకు అత్యంత కీలకమైన ప్రమోషనల్ ఈవెంట్ కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, ఖర్చుకు వెనకాడకుండా సెట్ నిర్మిస్తున్నారు. సాహోలో ఉపయోగించిన వాహనాలు, వస్తువుల్ని ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ప్రదర్శించబోతున్నారు. అందుకే ఈ భారీ […]

Advertisement
Update:2019-08-18 06:45 IST

మరికొన్ని గంటల్లో సాహో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. రామోజీ ఫిలిసిటీలో ఈ ఫంక్షన్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. కేవలం ఈ ఒక్క ఈవెంట్ కోసమే 2 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. సినిమాకు అత్యంత కీలకమైన ప్రమోషనల్ ఈవెంట్ కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, ఖర్చుకు వెనకాడకుండా సెట్ నిర్మిస్తున్నారు.

సాహోలో ఉపయోగించిన వాహనాలు, వస్తువుల్ని ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ప్రదర్శించబోతున్నారు. అందుకే ఈ భారీ ఏర్పాట్లు.

మరోవైపు ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం నేషనల్ మీడియాను ప్రత్యేకంగా హైదరాబాద్ తీసుకొస్తున్నారు. వాళ్లందరి విమాన ఖర్చులు సాహో యూనిట్టే భరిస్తోంది. వీళ్లతో పాటు కీలకమైన నటీనటుల్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటుచేసింది. ఇవన్నీ కలుపుకుంటే ఖర్చు రెండున్నర కోట్లు అవుతోంది.

నిజానికి విడుదలకు 2-3 రోజుల ముందు మాత్రమే ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేస్తారు. కానీ సాహో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను మాత్రం దాదాపు 12 రోజుల ముందే పెడుతున్నారు.

దీనికి కారణం సినిమాను 4 భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేయడమే. ఆఖరి నిమిషంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ పెడితే, ప్రచారం గందరగోళంగా మారుతుందని భావించి ఇలా ముందే ఈవెంట్ ప్లాన్ చేశారు.

ఈ భారీ ఈవెంట్ తర్వాత 4 భాషల్లో దశలవారీగా ప్రచారం చేస్తారు. ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది సాహో సినిమా.

Tags:    
Advertisement

Similar News