ఖేల్ రత్న అవార్డు రేసులో భజరంగ్ పూనియా

ఆసియా, కామన్వెల్త్ గేమ్స్ కుస్తీ విజేత భజరంగ్ ప్రపంచ కుస్తీలో భారత యువవస్తాదు భజరంగ్ పూనియా…దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న రేసులో నిలిచాడు. భారత కుస్తీకి విశేష సేవలు అందించినందుకు గాను భజరంగ్ పూనియా, వినేశ్ పోగట్ ల పేర్లను జాతీయ కుస్తీ సంఘం సిఫారసు చేసింది. పురుషుల 65 కిలోల ఫ్రీ-స్టయిల్ కుస్తీలో భజరంగ్ పూనియా గత కొద్దివారాలలోనే నాలుగు అంతర్జాతీయ టైటిల్స్ తో పాటు బంగారు పతకాలు సాధించాడు. అంతేకాదు…ఆసియా కుస్తీ […]

Advertisement
Update:2019-08-17 02:02 IST
  • ఆసియా, కామన్వెల్త్ గేమ్స్ కుస్తీ విజేత భజరంగ్

ప్రపంచ కుస్తీలో భారత యువవస్తాదు భజరంగ్ పూనియా…దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న రేసులో నిలిచాడు. భారత కుస్తీకి విశేష సేవలు అందించినందుకు గాను భజరంగ్ పూనియా, వినేశ్ పోగట్ ల పేర్లను జాతీయ కుస్తీ సంఘం సిఫారసు చేసింది.

పురుషుల 65 కిలోల ఫ్రీ-స్టయిల్ కుస్తీలో భజరంగ్ పూనియా గత కొద్దివారాలలోనే నాలుగు అంతర్జాతీయ టైటిల్స్ తో పాటు బంగారు పతకాలు సాధించాడు.

అంతేకాదు…ఆసియా కుస్తీ టైటిల్ తో పాటు గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో సైతం భారత్ కు బంగారు పతకాలు అందించాడు. జకార్తా ఆసియా క్రీడల్లో సైతం భజరంగ్ స్వర్ణం సాధించాడు.

గత ఏడాది భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానులకు సంయుక్తంగా రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ప్రదానం చేశారు.

1991-92 లో తొలిసారిగా ప్రవేశపెట్టిన రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని చదరంగరారాజు విశ్వనాథన్ ఆనంద్ కు ఇచ్చారు. నాటినుంచి మాస్టర్ సచిన్, ధోనీ, మేరీ కోమ్ లాంటి దిగ్గజాలు ఎందరో ఖేల్ రత్న పురస్కారాలు అందుకొన్నవారిలో ఉన్నారు.

జాతీయ క్రీడాదినోత్సవం వేడుకలలో భాగంగా క్రీడాపురస్కారాలను రాష్ట్ర్రపతి అందచేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News