చైనాలో రిలీజ్ కు రెడీ అయిన 2.O

ఇండియాలో సంచలనం సృష్టించింది రజనీకాంత్ నటించిన 2.O సినిమా. వసూళ్లలో సంచలనం కాదు. బడ్జెట్ పరంగా మాత్రమే సంచలనం. భారత్ లో అత్యథిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ప్రస్తుతానికి ఇదే. ఇప్పుడీ సినిమా చైనాలో కూడా భారీ ఎత్తున విడుదలకానుంది. వంద, 2 వందలు కాదు.. ఏకంగా 47వేలకు పైగా థియేటర్లలో 2.O విడుదలకాబోతోంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. ఇవన్నీ 3డీ స్క్రీన్స్. 2.O సినిమాను 3డీలో చూస్తేనే కిక్. ఇండియాలో కూడా ఎక్కువమంది […]

Advertisement
Update:2019-08-16 05:36 IST

ఇండియాలో సంచలనం సృష్టించింది రజనీకాంత్ నటించిన 2.O సినిమా. వసూళ్లలో సంచలనం కాదు. బడ్జెట్ పరంగా మాత్రమే సంచలనం. భారత్ లో అత్యథిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ప్రస్తుతానికి ఇదే. ఇప్పుడీ సినిమా చైనాలో కూడా భారీ ఎత్తున విడుదలకానుంది. వంద, 2 వందలు కాదు.. ఏకంగా 47వేలకు పైగా థియేటర్లలో 2.O విడుదలకాబోతోంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. ఇవన్నీ 3డీ స్క్రీన్స్.

2.O సినిమాను 3డీలో చూస్తేనే కిక్. ఇండియాలో కూడా ఎక్కువమంది ఈ సినిమాను త్రీడీలోనే చూశారు. మరీ ముఖ్యంగా చిన్నారులైతే ఎగబడ్డారు. అందుకే కాస్త ఆలస్యమైనప్పటికీ చైనాలో కూడా ఈ సినిమాను త్రీడీలోనే భారీ ఎత్తున విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అందుకే లేట్ అయినా భారీ ఎత్తున దిగుతున్నారు. చైనాలో ఓ విదేశీ చిత్రం ఇంత భారీఎత్తున రిలీజ్ కావడం ఇదే తొలిసారి. అవతార్, ఎవెంజర్స్ కు కూడా ఈ ఘనత దక్కలేదు.

తాజా ప్రణాళికతో బాహుబలి-2 వసూళ్లపై కన్నేశారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా అత్యథిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా బాహుబలి-2 నిలిచింది. ఆ తర్వాత చాలా సినిమాలు ఈ రికార్డును అధిగమించడానికి ప్రయత్నించి విఫలయ్యాయి. ఇప్పుడు చైనా అండతో ఆ రికార్డును బద్దలుకొట్టడానికి 2.O రెడీ అవుతోంది.

Tags:    
Advertisement

Similar News