మన్మథుడు-2 ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

తన సినిమాను ఎంత లేపడానికి నాగార్జున ట్రై చేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మన్మథుడు-2 సినిమాకు మొదటి రోజే డిజాస్టర్ టాక్ వచ్చేయడంతో, ఆ ప్రభావం వసూళ్లపై పడింది. ఈ సినిమా వసూళ్ళు రోజురోజుకు పడిపోతున్నాయి. చివరికి ఆదివారం కూడా ఆక్యుపెన్సీ లేకపోవడం మన్మథుడు-2ను నీరుగార్చింది. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు కేవలం 8 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అటుఇటుగా 18 కోట్ల రూపాయలకు అమ్మారు. […]

Advertisement
Update:2019-08-12 12:47 IST

తన సినిమాను ఎంత లేపడానికి నాగార్జున ట్రై చేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మన్మథుడు-2 సినిమాకు మొదటి రోజే డిజాస్టర్ టాక్ వచ్చేయడంతో, ఆ ప్రభావం వసూళ్లపై పడింది. ఈ సినిమా వసూళ్ళు రోజురోజుకు పడిపోతున్నాయి. చివరికి ఆదివారం కూడా ఆక్యుపెన్సీ లేకపోవడం మన్మథుడు-2ను నీరుగార్చింది. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు కేవలం 8 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అటుఇటుగా 18 కోట్ల రూపాయలకు అమ్మారు. మొదటి 3 రోజుల్లో వచ్చిన మొత్తం కేవలం 8 కోట్ల 5 లక్షల రూపాయలు మాత్రమే. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 10 కోట్లు రావాలి. ఈ టాక్ తో మన్మథుడు-2 సినిమా 10 కోట్లు సంపాదించడం దాదాపు అసాధ్యం అంటోంది ట్రేడ్. ఎనలిస్టుల అంచనా ప్రకారం.. ఈ సినిమాకు 50శాతం నష్టం వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఏపీ, నైజాం 3 రోజుల వసూళ్లు (షేర్)
నైజాం – రూ. 2.10 కోట్లు
సీడెడ్ – రూ. 0.81 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.84 కోట్లు
ఈస్ట్ – రూ. 0.41 కోట్లు
వెస్ట్ – రూ. 0.43 కోట్లు
గుంటూరు – రూ. 0.80 కోట్లు
కృష్ణా – రూ. 0.52 కోట్లు
నెల్లూరు – రూ. 0.25 కోట్లు

Tags:    
Advertisement

Similar News