మొదటి వారం ఓకే.... బ్రేక్-ఈవెన్ మాత్రం....

రాక్షసుడు.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కెరీర్ లోనే దీన్నొక హిట్ గా చెబుతున్నారు. అది నిజమే. చాన్నాళ్ల తర్వాత బెల్లంకొండ హిట్ కొట్టాడు. కానీ రెవెన్యూ పరంగా ఇది సక్సెస్ కాదు. ఇంకా చెప్పాలంటే బెల్లంకొండ కెరీర్ లో ఇది మరో కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలింది. తాజాగా వచ్చిన వసూళ్లు చూస్తే ఎవరైనా ఇది నిజమని ఒప్పుకుంటారు. నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకుంది రాక్షసుడు సినిమా. ఈ 7 రోజుల్లో సినిమాకు 9 కోట్ల రూపాయల […]

Advertisement
Update:2019-08-10 10:33 IST

రాక్షసుడు.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కెరీర్ లోనే దీన్నొక హిట్ గా చెబుతున్నారు. అది నిజమే. చాన్నాళ్ల తర్వాత బెల్లంకొండ హిట్ కొట్టాడు. కానీ రెవెన్యూ పరంగా ఇది సక్సెస్ కాదు. ఇంకా చెప్పాలంటే బెల్లంకొండ కెరీర్ లో ఇది మరో కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలింది. తాజాగా వచ్చిన వసూళ్లు చూస్తే ఎవరైనా ఇది నిజమని ఒప్పుకుంటారు.

నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకుంది రాక్షసుడు సినిమా. ఈ 7 రోజుల్లో సినిమాకు 9 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. మరోవైపు కొత్త సినిమాల రాకతో థియేటర్లు తగ్గిపోయాయి. దీంతో ఈ సినిమా ఇంకెంత కలెక్ట్ చేస్తుందనేది డౌట్ గా మారింది.

తాజా అంచనాల ప్రకారం.. ఈ సినిమా ఇప్పటివరకు 60శాతం మాత్రమే రికవర్ అయింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 40శాతం వరకు రావాలి. ఈ వీకెండ్ లో ఓ 20శాతం కవర్ అవుతుందని ఆశిస్తున్నారు. మిగతా 20శాతం కవర్ అయి, బ్రేక్-ఈవెన్ అవ్వాలంటే వచ్చే వీకెండ్ వరకు సినిమా ఆడాలి. ఆ తర్వాతే లాభాల సంగతి.

రాక్షసుడు సినిమా వెనక ఇంత కథ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ 7 రోజుల్లో సినిమాకొచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 3.20 కోట్లు
సీడెడ్ – రూ. 1.10 కోట్లు
ఉత్తరాంధ్ర -రూ. 1.12 కోట్లు
ఈస్ట్ – రూ. 0.60 కోట్లు
వెస్ట్ – రూ. 0.45 కోట్లు
గుంటూరు – రూ. 0.61 కోట్లు
నెల్లూరు – రూ. 0.25 కోట్లు
కృష్ణా – రూ. 0.60 కోట్లు

Tags:    
Advertisement

Similar News