జగన్ కేబినెట్ లో నంబర్ 2 ఎవరు?
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఇప్పుడు వైఎస్ జగన్ ఒక శక్తిలా మారాడు. ఆయన ఏం చెబితే అది శాసనం.. ఏపీలో పాలనా పరంగా ప్రక్షాళన చేస్తూ జెట్ స్పీడ్ తో నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. మరి జగన్ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో నంబర్ 2 ఎవరు అనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా ఇప్పుడు జగన్ విదేశాల్లో ఉన్నారు. ఇజ్రాయిల్ లో వ్యక్తిగత పర్యటన పెట్టుకున్నారు. మరి జగన్ గైర్హాజరీలో ప్రభుత్వాన్ని నడిపేది ఎవరు? […]
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఇప్పుడు వైఎస్ జగన్ ఒక శక్తిలా మారాడు. ఆయన ఏం చెబితే అది శాసనం.. ఏపీలో పాలనా పరంగా ప్రక్షాళన చేస్తూ జెట్ స్పీడ్ తో నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. మరి జగన్ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో నంబర్ 2 ఎవరు అనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది.
ముఖ్యంగా ఇప్పుడు జగన్ విదేశాల్లో ఉన్నారు. ఇజ్రాయిల్ లో వ్యక్తిగత పర్యటన పెట్టుకున్నారు. మరి జగన్ గైర్హాజరీలో ప్రభుత్వాన్ని నడిపేది ఎవరు? కీలక విషమ పరిస్థితి వస్తే ఎవరు లీడ్ తీసుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమవకమానదు.
సాధారణంగా తెలంగాణలో కేసీఆర్ ఏదైనా టూర్ లో ఉన్నప్పుడు పాలనా వ్యవహారాలను కేటీఆర్ చక్కదిద్దుతుంటారు. ఇక డిప్యూటీ సీఎం ఉన్నా వారు నామమాత్రంగానే ఉంటారు. ఏపీలోనూ నలుగురైదుగురు ఉన్నా వారికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు.
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో నంబర్ 1 తోపాటు నంబర్ 2 కూడా జగనే కనిపిస్తున్నారు. అసెంబ్లీలో మాత్రం జగన్ తర్వాత అన్నీ తానై వ్యవహరిస్తున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.
ఆర్థికమంత్రిగా రాష్ట్రాన్ని నడిపిస్తూ అసెంబ్లీలోనూ నడిపిస్తున్నారు. అయితే మంత్రుల పరంగా బుగ్గన కంటే సీనియర్లు అయిన బొత్సా, పిల్లి సుభాస్ చంద్రబోస్ , మరికొంత మంది ఉన్నారు. వీరిలో ఎవరు నంబర్ 2 అనేది చెప్పడం కష్టమే.
అయితే నంబర్ 2 ఎప్పుడూ డేంజరస్ పోస్టే. అందుకే ప్రస్తుతానికి విదేశాల్లో ఉన్నా కూడా జగనే సీఎంగా అన్నీ తానై చూసుకుంటున్నారు.