మరోసారి ప్రభాస్ పెళ్ళి వార్తలు... ఈసారి అమెరికా అమ్మాయట...!

ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ పేరే ముందు ఉంటుంది. గత కొంతకాలంగా ప్రభాస్ పెళ్లి గురించి బోలెడు పుకార్లు వినిపిస్తున్నాయి…. కానీ అందులో నిజానిజాలు మాత్రం ఇంకా తెలియడం లేదు. ‘బాహుబలి’ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటారు అని అందరూ అనుకున్నారు… కానీ ఆ వెంటనే ప్రభాస్ ‘సాహో’ సినిమా షూటింగ్ మొదలు పెట్టేసారు. ఇంకొన్ని రోజులలో ‘సాహో’ సినిమా విడుదల కాబోతోంది కూడా… కానీ ప్రభాస్ పెళ్లి […]

Advertisement
Update:2019-08-03 11:30 IST

ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ పేరే ముందు ఉంటుంది. గత కొంతకాలంగా ప్రభాస్ పెళ్లి గురించి బోలెడు పుకార్లు వినిపిస్తున్నాయి…. కానీ అందులో నిజానిజాలు మాత్రం ఇంకా తెలియడం లేదు.

‘బాహుబలి’ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటారు అని అందరూ అనుకున్నారు… కానీ ఆ వెంటనే ప్రభాస్ ‘సాహో’ సినిమా షూటింగ్ మొదలు పెట్టేసారు. ఇంకొన్ని రోజులలో ‘సాహో’ సినిమా విడుదల కాబోతోంది కూడా… కానీ ప్రభాస్ పెళ్లి గురించి మాత్రం ఏ వార్త బయటకు రావడం లేదు.

ఈ నేపథ్యంలో పెళ్లి గురించి అడిగిన ప్రతిసారీ ప్రభాస్ తెలివిగా సమాధానం ఇస్తున్నాడు. అంతా పెద్ద నాన్న ఇష్టం అని… పెళ్లి ప్రశ్నల నుంచి తప్పించుకుంటున్నాడు ప్రభాస్.

ఇంకొన్ని రోజుల్లో ప్రభాస్ కి 40 ఏళ్లు వస్తాయి. ఇక ప్రభాస్ ఎవరిని? ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? అంటూ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఒకప్పుడు ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారని… త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ తాము స్నేహితులం మాత్రమే అంటూ ఇద్దరూ చాలా సార్లు క్లారిటీ ఇచ్చేశారు.

తాజాగా ఇప్పుడు ప్రభాస్ పెళ్లి ఒక అమెరికా అమ్మాయితో జరగబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ వివాహమాడనున్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు ‘సాహో’ సినిమా ఆగస్టు 30న విడుదల కాబోతుంది.

Tags:    
Advertisement

Similar News