బాబు ఆరోగ్యంపై సొంత మీడియానే ఎందుకలా?

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన ఆరోగ్యంపై కాంగ్రెస్‌, వైసీపీ నేతలు పలు విమర్శలు చేసే వారు. కేవీపీ లాంటి వారు చంద్రబాబుకు అల్జిమర్స్ వచ్చాయని బహిరంగంగానే చెప్పారు. అలాంటి విమర్శలు వచ్చినప్పుడు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. చంద్రబాబు వంద శాతం ఫిట్ అనే వారు. కానీ ఎన్నికలు ముగిసిన వెంటనే టీడీపీ , దాని అనుకూల మీడియా వైఖరిలో మార్పు కనిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆయన అమెరికా వెళ్లేటప్పుడు […]

Advertisement
Update:2019-08-03 15:28 IST

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన ఆరోగ్యంపై కాంగ్రెస్‌, వైసీపీ నేతలు పలు విమర్శలు చేసే వారు. కేవీపీ లాంటి వారు చంద్రబాబుకు అల్జిమర్స్ వచ్చాయని బహిరంగంగానే చెప్పారు. అలాంటి విమర్శలు వచ్చినప్పుడు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. చంద్రబాబు వంద శాతం ఫిట్ అనే వారు. కానీ ఎన్నికలు ముగిసిన వెంటనే టీడీపీ , దాని అనుకూల మీడియా వైఖరిలో మార్పు కనిస్తోంది.

ప్రస్తుతం చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆయన అమెరికా వెళ్లేటప్పుడు అందరూ అది ఫ్యామిలీ టూర్ అనే చెప్పారు. కానీ చంద్రబాబు వైద్య పరీక్షల కోసం వెళ్లారని తొలుత ప్రచురించింది టీడీపీ పత్రికలే. టీడీపీ కోసం ఎన్నికల సమయంలో ఎంతకైనా తెగించి కథనాలు రాసిన సదరు పత్రిక రెండు రోజుల క్రితం చంద్రబాబు అమెరికాలో టిఫిన్ చేస్తున్న ఫొటోను ప్రచురించింది. ఆ ఫొటో కింద ఆస్పత్రిలో అల్పాహారం తీసుకుంటున్న చంద్రబాబు అంటూ వివరించింది.

టీడీపీ అనుకూల మీడియా చానళ్లు కూడా చంద్రబాబు వైద్య పరీక్షల కోసమే వెళ్లారని బహిరంగంగానే చెబుతున్నాయి. ఎప్పుడూ మా బాబు ఫిట్ అనే చెప్పే బాబు అనుకూల మీడియా ఇప్పుడు స్వయంగా బాబుకు ఆరోగ్య సమస్యలున్నాయని ప్రచారం చేయడం వెనుక ఏదో మర్మం ఉందన్న అనుమానం పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఇది సానుభూతికోసమా లేదంటే మరేదైనా ముందు చూపు ఉందా? అన్నది పలువురి అనుమానం. ఏది ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే వాటి నుంచి బయటపడి చంద్రబాబు మంచి ఆరోగ్యంతో తిరిగిరావాలని అందరూ కోరుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News