కాంగ్రెస్, బీజేపీ.... ఆస్తులు, అప్పులు ఇవే !

ఎన్నికల నిఘా సంస్థ ఏడీఆర్ రాజకీయ పార్టీల ఆస్తుల లెక్కను విప్పింది. అధికారంలో ఉన్న బీజేపీ ఆస్తులు అమాంతం పెరగగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ ఆస్తులు కీణించడం గమనార్హం. రాజకీయ పార్టీలకు దేశంలోని వివిధ పారిశ్రామికవేత్తలు, సంస్థలు విరాళాలు ఇస్తుంటాయి. ఈ లెక్కలను తాజాగా ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. బీజేపీ ఆస్తులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో 22.27శాతం పెరిగాయని ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. 2016-17లో రూ.1,213 కోట్లుగా ఉన్న బీజేపీ ఆస్తులు.. 2017-18లో రూ.1,483 కోట్లకు ఎగబాకాయి. ఇక […]

Advertisement
Update:2019-08-01 09:48 IST

ఎన్నికల నిఘా సంస్థ ఏడీఆర్ రాజకీయ పార్టీల ఆస్తుల లెక్కను విప్పింది. అధికారంలో ఉన్న బీజేపీ ఆస్తులు అమాంతం పెరగగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ ఆస్తులు కీణించడం గమనార్హం. రాజకీయ పార్టీలకు దేశంలోని వివిధ పారిశ్రామికవేత్తలు, సంస్థలు విరాళాలు ఇస్తుంటాయి. ఈ లెక్కలను తాజాగా ఏడీఆర్ సంస్థ వెల్లడించింది.

బీజేపీ ఆస్తులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో 22.27శాతం పెరిగాయని ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. 2016-17లో రూ.1,213 కోట్లుగా ఉన్న బీజేపీ ఆస్తులు.. 2017-18లో రూ.1,483 కోట్లకు ఎగబాకాయి.

ఇక కాంగ్రెస్ పార్టీ ఆస్తులు మాత్రం తగ్గినట్టు ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. ఆ సంస్థ ఆస్తులు రూ.854 కోట్ల నుంచి రూ.724 కోట్లకు పడిపోయాయని తెలిపింది. 15.26శాతం తగ్గిపోయాయని తెలిపింది.

ఇక దేశంలోని మిగతా పార్టీల విషయానికి వస్తే ఎన్సీపీ ఆస్తులు రూ.11 కోట్ల నుంచి 9.54 కోట్లకు తగ్గాయని ఏడీఆర్ వివరించింది. తృణమూల్ కాంగ్రెస్ ఆస్తులు మాత్రం 26.25 కోట్ల నుంచి 29.10కోట్లకు పెరిగాయని తెలిపింది.

పార్టీల అప్పుల లెక్కను కూడా ఏడీఆర్ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ అప్పులు 324.2 కోట్లు ప్రకటించగా.. బీజేపీ అప్పులు 21.38 కోట్లుగా ప్రకటించింది.

దేశంలో బీజేపీ అధికారంలో ఉండడంతో ఆ పార్టీకి సహజంగానే విరాళాలతో ఆస్తులు పెరిగాయి. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ కు కూడా బాగానే వచ్చాయి. ఈ రెండు పార్టీల దరిదాపుల్లో మిగతా పార్టీలు లేకపోవడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News