జగన్ ఆస్తుల కేసులో సంచలన పరిణామం
జగన్ ఆస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వాన్‌పిక్ కేసులో జప్తు చేసిన ఆస్తులన్నింటిని తిరిగి అప్పగించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఈడీ అప్పిలేట్ ఆధారిటీ ఆదేశించింది. కంపెనీల్లో పెట్టుబడులను ముడుపులుగా నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అప్పిలేట్ ఆథారిటీ తేల్చిచెప్పింది. ఈ కేసులో జప్తు చేసిన జగన్, నిమ్మగడ్డ ప్రసాద్‌లకు సంబంధించిన ఆస్తులన్నింటిని తిరిగి అప్పగించాలని ఆదేశించింది. గతంలో ఈడీ ఇడుపులపాయలో జగన్‌కు సంబంధించిన 42 ఎకరాల భూమిని, పులివెందులలో 16 ఎకరాల భూమిని, […]
జగన్ ఆస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వాన్‌పిక్ కేసులో జప్తు చేసిన ఆస్తులన్నింటిని తిరిగి అప్పగించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఈడీ అప్పిలేట్ ఆధారిటీ ఆదేశించింది.
కంపెనీల్లో పెట్టుబడులను ముడుపులుగా నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అప్పిలేట్ ఆథారిటీ తేల్చిచెప్పింది. ఈ కేసులో జప్తు చేసిన జగన్, నిమ్మగడ్డ ప్రసాద్‌లకు సంబంధించిన ఆస్తులన్నింటిని తిరిగి అప్పగించాలని ఆదేశించింది.
గతంలో ఈడీ ఇడుపులపాయలో జగన్‌కు సంబంధించిన 42 ఎకరాల భూమిని, పులివెందులలో 16 ఎకరాల భూమిని, బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని ఆస్తులను అటాచ్ చేసింది.
సాక్షి ప్రధాన కార్యాలయం, లోటస్ పాండ్ నివాసం, సాక్షి పత్రిక యంత్రాలను గతంలో ఈడీ జప్తు చేసింది. వాటన్నింటిని తిరిగి అప్పగించాల్సిందిగా ఈడీకి అప్పిలేట్ ఆథారిటీ ఆదేశించింది.
అదే విధంగా నిమ్మగడ్డకు చెందిన వాన్‌పిక్ భూములతో పాటు, మొత్తం 325కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. వాటన్నింటిని తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది.
ఈ సందర్భంగా ఈడీ తీరుపై అప్పిలేట్ ఆథారిటీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా అటాచ్‌లు చేశారని… చివరకు వైఎస్ భారతీ జీతంగా తీసుకున్న సొమ్మును కూడా అటాచ్ చేయడం ఏమిటని ప్రశ్నించింది.