అర్జున్ సురవరం పై.... నిఖిల్ కామెంట్స్

నిఖిల్ సిద్దార్థ్ హీరో గా తెలుగు లో అప్పుడెప్పుడో మొదలైన సినిమా అర్జున్ సురవరం… ముద్ర అనే టైటిల్ తో మొదట మొదలైన ఈ సినిమా అర్జున్ సురవరం టైటిల్ మార్చుకుని క్రమక్రమం గా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎప్పుడెప్పుడా అని అందరూ ఈ సినిమా విడుదల గురించి ఎదురు చూస్తున్నారు. అయితే నిఖిల్ మాత్రం ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండిపోయాడు. The wait will b worth.. After pedannas Saaho… release of […]

Advertisement
Update:2019-07-28 05:44 IST

నిఖిల్ సిద్దార్థ్ హీరో గా తెలుగు లో అప్పుడెప్పుడో మొదలైన సినిమా అర్జున్ సురవరం… ముద్ర అనే టైటిల్ తో మొదట మొదలైన ఈ సినిమా అర్జున్ సురవరం టైటిల్ మార్చుకుని క్రమక్రమం గా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎప్పుడెప్పుడా అని అందరూ ఈ సినిమా విడుదల గురించి ఎదురు చూస్తున్నారు. అయితే నిఖిల్ మాత్రం ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండిపోయాడు.

దాదాపు గా రెండు మూడు సార్లు విడుదల తేదీ ని ప్రకటించి ఆ తర్వాత సినిమా ని వాయిదా వేశారు దర్శక నిర్మాతలు. అర్జున్ సురవరం అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా తమిళం లో విడుదల అయ్యి పెద్ద విజయం సాధించిన కనితాన్ అనే సినిమా కి రీమేక్. ఈ సినిమా కి సంతోష్ దర్శకత్వం వహించాడు. తమిళం లో కూడా ఆయనే ఈ సినిమాకి దర్శకత్వం చేశాడు.

ట్విట్టర్ లో అభిమానుల నుంచి విపరీతం గా కామెంట్స్ వస్తున్న నేపథ్యం లో నిఖిల్ అర్జున్ సురవరం విడుదల పై నోరు విప్పాడు.

16 నెలలైనా నిఖిల్ నుండి కొత్త చిత్రం లేదు అని అభిమానులు నిరుత్సాహ పడుతున్న నేపథ్యం లో అర్జున్ సురవరం సాహో విడుదల అనంతరం ఉండబోతుంది అని నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. తేదీ ప్రకటించలేదు కానీ ఈ సినిమా మాత్రం సెప్టెంబర్ లో రానుంది అని నిఖిల్ చెప్పాడు.

Tags:    
Advertisement

Similar News