ఒక్క సినిమా... రెండు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి !

తెలుగు లో భారీ విజయం సాధించిన అర్జున్ రెడ్డి ని హిందీ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసాడు షాహిద్ కపూర్. ఈ సినిమా పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు షాహిద్ కపూర్ ని మరొక తెలుగు సినిమా రీమేక్ కోసం అప్రోచ్ అయ్యారట. తెలుగు లో విడుదల అయ్యి పెద్ద విజయం సాధించిన జెర్సీ సినిమా ని హిందీ లో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట అల్లు అరవింద్, దిల్ […]

Advertisement
Update:2019-07-27 04:01 IST

తెలుగు లో భారీ విజయం సాధించిన అర్జున్ రెడ్డి ని హిందీ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసాడు షాహిద్ కపూర్. ఈ సినిమా పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిన విషయమే.

అయితే ఇప్పుడు షాహిద్ కపూర్ ని మరొక తెలుగు సినిమా రీమేక్ కోసం అప్రోచ్ అయ్యారట. తెలుగు లో విడుదల అయ్యి పెద్ద విజయం సాధించిన జెర్సీ సినిమా ని హిందీ లో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట అల్లు అరవింద్, దిల్ రాజు, సూర్యదేవర నాగ వంశీ.

ఈ సినిమా లో హీరో పాత్ర కి షాహిద్ అయితే బాగుంటాడని వారు అభిప్రాయపడుతున్నారట. ఇంకా ఈ సినిమా లో నటించడానికి 40 కోట్లు పారితోషికం షాహిద్ అడిగినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో బాగా చక్కర్లు కొడుతున్న వార్త ఇది.

మరోవైపు…. హిందీ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా రీమేక్ కి సంబందించిన చర్చలని దగ్గరుండి చూసుకుంటున్నాడని… హిందీ లో కూడా ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరే దర్శకత్వం వహిస్తాడని మరో చర్చ నడుస్తోంది.

ఈ సినిమా పై మరింత సమాచారం త్వరలో తెలియనుంది.

Tags:    
Advertisement

Similar News