యువ దర్శకుడితో.... అమలా పాల్ తెలుగు సినిమా?

ఇటీవలే ‘ఆమె’ సినిమా తో తెలుగు ప్రేక్షకులని పలకరించింది హీరోయిన్ అమలా పాల్. ఈ సినిమా తమిళం లో మంచి విజయం సాధించినప్పటికీ…. తెలుగు లో మాత్రం పెద్దగా జనాలకెక్కలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను కొన్న వాళ్ళకి నష్టాలని తీసుకొచ్చే లాగే ఉంది. అయితే ఈ విషయం మీద అమలకి చాలా అసంతృప్తి ఉందట. ఎలాగైనా తెలుగు లో ఒక మంచి సినిమా చేసి, తెలుగు ప్రేక్షకులని మెప్పించాలని అనుకుంటుందట. చాలా రోజుల కిందటే అమల తెలుగు […]

Advertisement
Update:2019-07-27 10:19 IST

ఇటీవలే ‘ఆమె’ సినిమా తో తెలుగు ప్రేక్షకులని పలకరించింది హీరోయిన్ అమలా పాల్. ఈ సినిమా తమిళం లో మంచి విజయం సాధించినప్పటికీ…. తెలుగు లో మాత్రం పెద్దగా జనాలకెక్కలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను కొన్న వాళ్ళకి నష్టాలని తీసుకొచ్చే లాగే ఉంది.

అయితే ఈ విషయం మీద అమలకి చాలా అసంతృప్తి ఉందట. ఎలాగైనా తెలుగు లో ఒక మంచి సినిమా చేసి, తెలుగు ప్రేక్షకులని మెప్పించాలని అనుకుంటుందట.

చాలా రోజుల కిందటే అమల తెలుగు లో ఒక సినిమా చేయాల్సి ఉంది… కానీ కుదరలేదు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం అమలా పాల్ ని ఒక యువ దర్శకుడు అప్రోచ్ అయ్యాడట. ఒక థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ని అమల కి చెప్పాడట దర్శకుడు. ఈ కథతోనే అమల తెలుగు లో కూడా డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వాలనే ఉదేశ్యం తో ఉందట.

కుదిరితే ఈ సినిమా ని తన సొంత బ్యానర్ లో నిర్మించే ఆలోచన కూడా చేస్తుందట అమల…!

Tags:    
Advertisement

Similar News