సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం
కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్దమైంది. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ తొలుత తర్జనభర్జన పడింది. యడ్డీని ముఖ్యమంత్రిని చేసే విషయంలో ఆయన వయసు అడ్డు వస్తుందని భావించింది. 75 ఏళ్లు పైబడిన వారికి పదవులు ఇవ్వకూడదని బీజేపీ నిర్ణయించుకుంది. యడ్యూరప్ప వయసు ప్రస్తుతం 77 ఏళ్లు కావడంతో తొలుత బీజేపీ ఆలోచన చేసింది. అయితే యడ్డీని కాకుండా మరొకరిని ముఖ్యమంత్రిని చేస్తే సహించే ప్రసక్తే లేదని పలువురు ఎమ్మెల్యేలు స్పష్టం […]
కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్దమైంది. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ తొలుత తర్జనభర్జన పడింది. యడ్డీని ముఖ్యమంత్రిని చేసే విషయంలో ఆయన వయసు అడ్డు వస్తుందని భావించింది.
75 ఏళ్లు పైబడిన వారికి పదవులు ఇవ్వకూడదని బీజేపీ నిర్ణయించుకుంది. యడ్యూరప్ప వయసు ప్రస్తుతం 77 ఏళ్లు కావడంతో తొలుత బీజేపీ ఆలోచన చేసింది. అయితే యడ్డీని కాకుండా మరొకరిని ముఖ్యమంత్రిని చేస్తే సహించే ప్రసక్తే లేదని పలువురు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
ఇంతలో యడ్యూరప్ప గవర్నర్ వాజూభాయ్‌ని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని గవర్నర్ తో భేటీ అనంతరం యడ్యూరప్ప ప్రకటించారు. ఇందుకు గవర్నర్ కూడా అంగీకరించారని వివరించారు.