జల వివాదాలపై కేంద్రం కొత్త నిర్ణయం

దేశంలో రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునల్స్‌ స్థానంలో శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జలవివాదాలను దశాబ్దాల తరబడి సాగదీయకుండా… గరిష్టంగా నాలుగున్నరేల్లలో సమస్యను పరిష్కరించేలా శాశ్వత ట్రిబ్యునల్ పని చేస్తుంది. ఒకసారి శాశ్వత ట్రిబునల్ తీర్పు ఇస్తే అదే ఫైనల్. దాన్ని అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే. ఇప్పటిలా అధికారిక గెజిట్‌లో ప్రచురించాల్సిన అవసరం […]

Advertisement
Update:2019-07-26 06:02 IST

దేశంలో రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునల్స్‌ స్థానంలో శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

జలవివాదాలను దశాబ్దాల తరబడి సాగదీయకుండా… గరిష్టంగా నాలుగున్నరేల్లలో సమస్యను పరిష్కరించేలా శాశ్వత ట్రిబ్యునల్ పని చేస్తుంది. ఒకసారి శాశ్వత ట్రిబునల్ తీర్పు ఇస్తే అదే ఫైనల్. దాన్ని అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే.

ఇప్పటిలా అధికారిక గెజిట్‌లో ప్రచురించాల్సిన అవసరం కూడా ఉండదు. తుది తీర్పు వెలువడిన తర్వాత ఇంకా ఏమైనా అభ్యంతరాలు, లేదా కొత్త అంశాలను బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లటానికి ఏడాది సమయం ఉంటుంది. కొత్త ట్రిబ్యునల్ అందుబాటులోకి రాగానే పాత ట్రిబ్యునల్స్ అన్ని ఆటోమెటిక్‌గా రద్దవుతాయి.

కొత్త ట్రిబ్యునల్‌లో ఒక ఛైర్మన్‌, ఒక వైస్‌ఛైర్మన్‌, ఆరుగురు సభ్యులు ఉంటారు. ఇందులో ముగ్గురు న్యాయ వ్యవస్థకు చెందిన వారు కాగా మరో ముగ్గురు జల వనరుల రంగ నిపుణులు.

ట్రిబ్యునల్‌ ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌, సభ్యులను ప్రధాన మంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి , కేంద్ర న్యాయశాఖ మంత్రి, జల వనరులశాఖ మంత్రి నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేస్తుంది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వారు మాత్రమే ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ పదవులు చేపట్టడానికి అర్హులు.

అయితే ఈ బిల్లును కాంగ్రెస్‌తో పాటు పలు విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్షంగా బిల్లు తెస్తున్నారని మండిపడ్డాయి.

Tags:    
Advertisement

Similar News