లావు గా ఉన్నావ్ అన్నందుకు.... రాశి ఖన్నా సమాధానం ఇది
ఒకప్పుడు రాశి ఖన్నా లావు గా ఉంది అని చాలా మంది ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. కానీ హీరోయిన్ దాని గురించి ఎప్పుడూ బాధ పడలేదు. కష్టపడి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలా కామెంట్స్ చేసింది.. ఒక ఆంగ్ల పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాశి ఖన్నా అనేక విషయాల పై ముచ్చటించింది. అందులో భాగం గా తన శరీరాన్ని ఎలా క్రమక్రమం గా మార్చుకుంది అనే విషయం పై న కూడా మనసు విప్పింది. […]
ఒకప్పుడు రాశి ఖన్నా లావు గా ఉంది అని చాలా మంది ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. కానీ హీరోయిన్ దాని గురించి ఎప్పుడూ బాధ పడలేదు. కష్టపడి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలా కామెంట్స్ చేసింది..
ఒక ఆంగ్ల పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాశి ఖన్నా అనేక విషయాల పై ముచ్చటించింది. అందులో భాగం గా తన శరీరాన్ని ఎలా క్రమక్రమం గా మార్చుకుంది అనే విషయం పై న కూడా మనసు విప్పింది. నిజానికి ఈ మధ్య రాశి చాలా మారిపోయింది. తన ఫీజిక్ విషయం లో మంచి శ్రద్ద కనబరుస్తుంది.
“రాత్రి కి రాత్రి ఫలితాలు వచ్చేస్తాయి అనుకుంటే కుదరదు. నిత్యం కసరత్తులు చేస్తూ ఉండాలి. డైటింగ్ విషయం మీద నాకు నమ్మకం లేదు. నాకు దాదాపు గా రెండు ఏళ్ళ సమయం పట్టింది నా శరీరాన్ని నేను నాకు నచ్చిన రీతి లో మార్చుకునేందుకు. ఇప్పుడు నేను చాలా ఆరోగ్యం గా, సంతోషం గా ఉన్నాను. ఇప్పటికీ నేను వారానికి ఆరు రోజులు కసరత్తులు చేస్తూ ఒక ఆరోగ్యకరమైన, సమాంతరంగా డైట్ ని ఫాలో అవుతూ ఉంటాను.” అని రాశి ఖన్నా చెప్పింది.
ప్రస్తుతం ఈ హీరోయిన్ వెంకీ మామ సినిమా లో నాగ చైతన్య సరసన నటిస్తుంది. అంతే కాకుండా విజయ్ దేవరకొండ తో ఒక సినిమా, సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమా లో కూడా నటిస్తుంది.