ఎంఐఎం కోసం కేసీఆర్ రూల్స్ మారుస్తాడా?
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం ఆరుకు పడిపోయింది. స్వతహాగానే ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం హోదాపోయింది. ఇప్పుడు కేసీఆర్ తో దోస్తీ నెరుపుతున్న ఎంఐఎం పార్టీ శాసనసభలో టీఆర్ఎస్ తర్వాత అత్యధిక స్థానాలున్న ప్రతిపక్షంగా నిలిచింది. తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మంచి అవగాహనతో పనిచేసిన టీఆర్ఎస్, ఎంఐఎంలు… అసెంబ్లీలో కలబడుతారా? ఎంఐఎం కోరినట్టు కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష హోదా గనుక ఎంఐఎంకు ఇస్తే ఇదే జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ హోదాతోపాటు […]
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం ఆరుకు పడిపోయింది. స్వతహాగానే ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం హోదాపోయింది. ఇప్పుడు కేసీఆర్ తో దోస్తీ నెరుపుతున్న ఎంఐఎం పార్టీ శాసనసభలో టీఆర్ఎస్ తర్వాత అత్యధిక స్థానాలున్న ప్రతిపక్షంగా నిలిచింది.
తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మంచి అవగాహనతో పనిచేసిన టీఆర్ఎస్, ఎంఐఎంలు… అసెంబ్లీలో కలబడుతారా? ఎంఐఎం కోరినట్టు కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష హోదా గనుక ఎంఐఎంకు ఇస్తే ఇదే జరుగుతుంది.
తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ హోదాతోపాటు ఆ హోదాతో వచ్చే వసతులు ఉంటాయి. వాటిని వినియోగించుకోవాలని ఎంఐఎం స్కెచ్ గీస్తోంది. అయితే కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ ను కాదని ఎంఐఎంకు ఇస్తే పెద్ద దుమారం రేగుతుందని సైలెంట్ గా ఉన్నారు.
అయితే ఎంఐఎంకు శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సాంకేతిక కారణాలు కూడా అడ్డుపడుతున్నాయి. ఏడుగురు సభ్యులున్న ఎంఐఎంకు హోదా దక్కడం కష్టంగా ఉంది. అసెంబ్లీలోని మొత్తం 119శాసనసభ్యుల్లో పదోవంతు ఎమ్మెల్యేలుంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అంటే 12మంది అవసరం. కానీ ఏడుగురే ఉన్న ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కేసీఆర్ రూల్స్ బ్రేక్ చేయాల్సిందే. పైగా మిత్రపక్షానికే ప్రతిపక్ష హోదా ఇస్తే భజన తప్ప ఏమీ ఉండదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి కేసీఆర్ ఏం డిసైడ్ చేస్తాడన్నది వేచి చూడాలి.