ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లకే రక్షణ కరువు

నిజాంపేట్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్2 కాలనీలో తాత్కాలిక రేకుల రూమ్స్‌ను హైడ్రా అధికారులు కూల్చివేసింది.;

Advertisement
Update:2025-03-04 15:08 IST

హైదరాబాద్‌లో పేదల ఇండ్లపై పడగెత్తింది.నిజాంపేట్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్2 కాలనీలో ఇండ్లు రోడ్లపై ఉన్నాయంటూ ఇండ్లను హైడ్రా అధికారులు కూల్చిచారు. ఇందిరమ్మ ఇండ్లలో నివాసం ఉంటున్న నిరుపేదలు, తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రేకుల రూమ్స్‌ను నిర్దయగా కూల్చివేసింది. దీంతో పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలమైన తమపై ప్రతాపం చూపుతున్న అధికారులు పెద్దల ఆక్రమణలను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రోడ్డుకు అడ్డంగా అధికారులు కూల్చివేసిన సామాన్లు వేసి బైఠాయించి నిరసన తెలియజేశారు.

కాంగ్రెస్ పాలనను ఇందిరమ్మ రాజ్యాంగ ప్రకటించుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా తమ ఇండ్లను కూల్చివేస్తుందని, ఇందిరమ్మ ఇండ్లలో కొందరు పిల్లర్లు, స్లాబులు వేసి శాశ్వత నిర్మాణాలు చేపట్టిన వారిని వదిలిపెట్టి చిన్నాచితక వ్యాపారాల కోసం ఏర్పాటు చేసుకున్న గదులను కూల్చడంపై మండిపడ్డారు. ఓట్ల ఓట్ల కోసం వచ్చే సమయంలో తమ చుట్టూ తిరిగే నేతలు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఈసారి ఎవ్వడు ఓట్లకు వచ్చిన తగిన బుద్ధి చెప్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ -2 నుండి బాలాజీ హిల్స్ కాలనీ, కేటీఆర్ కాలనీకి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఇందిరమ్మ కాలనీవాసులు తమ ఇండ్ల ముందర స్థలాలను ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న రేకుల రూములను హైడ్రాధికారులు మంగళవారం కూల్చివేయడం ఉద్రిక్తకు దారితీసింది.

Tags:    
Advertisement

Similar News