జగన్‌పై దాడి కేసు నిందితునికి షాక్ ఇచ్చిన హైకోర్టు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గత ఏడాది విశాఖ విమానాశ్రయంలో కత్తితో దాడి చేసిన జనుపల్లి శ్రీనివాస రావుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. నిందితునికి గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని ఎన్ఐఏ పిటిషన్ వేసింది. దానిపై ఇవాళ కోర్టులో వాదనలు జరిగాయి. ఎన్ఐఏ తరపు వాదించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు… శ్రీనివాస్ బెయిల్‌ను రద్దు చేసింది. కాగా, నిందితుడికి బెయిల్ రద్దుపై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని న్యాయస్థానం కల్పించింది. గత […]

Advertisement
Update:2019-07-19 10:29 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గత ఏడాది విశాఖ విమానాశ్రయంలో కత్తితో దాడి చేసిన జనుపల్లి శ్రీనివాస రావుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. నిందితునికి గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని ఎన్ఐఏ పిటిషన్ వేసింది. దానిపై ఇవాళ కోర్టులో వాదనలు జరిగాయి.

ఎన్ఐఏ తరపు వాదించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు… శ్రీనివాస్ బెయిల్‌ను రద్దు చేసింది. కాగా, నిందితుడికి బెయిల్ రద్దుపై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని న్యాయస్థానం కల్పించింది.

గత ఏడాది అక్టోబరు 25న వైఎస్ జగన్‌పై దాడి జరిగింది. ఆ కేసును ఎన్ఐఏకు బదిలీ చేసిన తర్వాత ఈ ఏడాది మే 22న శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు అయ్యింది. ఆయన అదే నెల 25న రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యాడు.

కాగా, కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని.. కింది కోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు చెప్పారు. బెయిల్ మంజూరు సమయంలో తగిన కారణాలు చెప్పలేదని.. జగన్‌పై జరిగిన హత్యాయత్నం… చట్ట వ్యతిరేక కార్యాకలాపాల నిర్వచన పరిధిలోనిదని చెప్పారు.

సెక్షన్ 6ఏ ప్రకారం బెయిల్ మంజూరుకు గల కారణాలు చెప్పడం తప్పని సరి అని…. కావున నిబంధనలకు విరుద్దంగా ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో కోర్టు బెయిల్ రద్దు చేసింది.

Tags:    
Advertisement

Similar News