'ఇస్మార్ట్ శంకర్' సినిమా రివ్యూ
రివ్యూ: ఇస్మార్ట్ శంకర్ రేటింగ్: 2.5/5 తారాగణం: రామ్, నిధి అగర్వాల్, నభ నటేష్, సత్యదేవ్, పునీత్ ఇస్సార్, దీపక్ శెట్టి, తులసి, ఆశిష్ విద్యార్థి, షయాజి షిండే, గెటప్ శ్రీను తదితరులు సంగీతం: మణి శర్మ నిర్మాత: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్ దర్శకత్వం: పూరి జగన్నాధ్ ఈ మధ్యనే ‘హలో గురూ ప్రేమ కోసమే’ అనే యావరేజ్ సినిమాతో వచ్చిన యువ హీరో రామ్ పోతినేని…. ఇప్పుడు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చేతులు కలిపి ‘ఇస్మార్ట్ […]
రివ్యూ: ఇస్మార్ట్ శంకర్
రేటింగ్: 2.5/5
తారాగణం: రామ్, నిధి అగర్వాల్, నభ నటేష్, సత్యదేవ్, పునీత్ ఇస్సార్, దీపక్ శెట్టి, తులసి, ఆశిష్ విద్యార్థి, షయాజి షిండే, గెటప్ శ్రీను తదితరులు
సంగీతం: మణి శర్మ
నిర్మాత: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్
దర్శకత్వం: పూరి జగన్నాధ్
ఈ మధ్యనే ‘హలో గురూ ప్రేమ కోసమే’ అనే యావరేజ్ సినిమాతో వచ్చిన యువ హీరో రామ్ పోతినేని…. ఇప్పుడు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చేతులు కలిపి ‘ఇస్మార్ట్ శంకర్’ అనే ఒక పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ మరియు ట్రైలర్ లతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజు విడుదలైంది. మరి వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ ఈ సినిమాతోనైనా ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి..
శంకర్ (రామ్ పోతినేని) ఓల్డ్ సిటీలో ఉంటాడు. సెటిల్మెంట్ లు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఓకరోజు డీల్ విషయంలో అతనికి చాందిని (నభా నటేష్) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు శంకర్. కానీ అదే సమయంలో పొలిటీషియన్ కాశీ రెడ్డి మర్డర్ కేసులో పోలీసులు శంకర్ ని అరెస్ట్ చేస్తారు.
జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన శంకర్ మెదడులోకి మరో వ్యక్తి జ్ఞాపకాలను ట్రాన్స్‌ప్లాంట్ చేస్తుంది సైంటిస్ట్ పింకీ (నిధి అగర్వాల్). అసలు శంకర్ మెదడులో వేరే వ్యక్తి జ్ఞాపకాలను ఎందుకు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు? పొలిటీషియన్ కాశీరెడ్డిని ఎవరు చంపారు? శంకర్‌కి సీబీఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్)కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
రామ్ పోతినేని ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు అని చెప్పుకోవచ్చు. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది.
ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేయకపోయినప్పటికీ రామ్ తన పాత్రలో ఒదిగిపోయి బాగా నటించాడు. తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ మరియు నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు రామ్.
హీరోయిన్లు నిధి అగర్వాల్ మరియు నభ నటేష్ ఒకరితో ఒకరు పోటీపడి నటించారు. ఒక వైపు అందాల ఆరబోత మాత్రమే కాక మరో వైపు నటన పరంగా కూడా మంచి మార్కులు వేయించుకున్న నిధి మరియు నభ…. ఈ సినిమాలో రామ్ తో మంచి కెమిస్ట్రీని మైంటైన్ చేశారు.
పునీత్ ఇస్సార్ మరియు దీపక్ శెట్టి ఈ సినిమాలో బాగా నటించారు. సత్యదేవ్ తెరపై కనిపించింది తక్కువ సేపే అయినా పవర్ ఫుల్ పాత్రలో నటించాడు. ఆశిష్ విద్యార్ధి మరియు షాయాజీ షిండే కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. తులసి చాలా సహజంగా నటించింది. గెటప్ శీను కామెడీ టైమింగ్ బాగుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ సినిమా కోసం ఒక మంచి కథను ఎంపిక చేసుకున్నాడు. ప్రతి సన్నివేశంలోనూ మనకి పూరి మార్క్ కనిపిస్తుంది. కొంచెం కాంప్లికేటెడ్ కథ అయినప్పటికీ…. కథను పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే టెంపోతో వెళ్ళాడు పూరి జగన్నాథ్. పూరికి కచ్చితంగా ఇది ఒక కం బ్యాక్ ఫిల్మ్ అని చెప్పవచ్చు.
పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ సంయుక్తంగా అందించిన నిర్మాణ విలువలు సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి వెన్నెముక గా మారింది. కేవలం పాటలు మాత్రమే కాకుండా మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని చాలా బాగా ఎలివేట్ చేసింది. రాజ్ తోట అందించిన విజువల్స్ బాగున్నాయి. జునాయిద్ సిద్ధికి ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.
బలాలు:
రామ్ నటన, పూరి మార్క్ సన్నివేశాలు, సంగీతం
బలహీనతలు:
కొన్ని సాగతీత సన్నివేశాలు, రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్లు
ఒక సరికొత్త కథకి దర్శకుడు పూరి జగన్నాథ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా మొదటి అరగంట లోనే ప్రేక్షకులను కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది.
ఫస్ట్ హాఫ్ లో సత్య దేవ్ ప్లాట్ లైన్ చాలా బాగుంటుంది. ఇక ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కథలోనే హైలైట్. కానీ అనుకున్న విధంగానే సెకండ్ హాఫ్ లో మాత్రం కథ చాలా ప్రెడిక్టిబుల్ గా మారిపోతుంది.
ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఆసక్తికరంగా నడిచినప్పటికీ, సెకండ్ హాఫ్ లో మాత్రం రొటీన్ కమర్షియల్ ఫార్ములాని వాడినట్లుగా అనిపిస్తుంది. రామ్ అద్భుతమైన పర్ఫామెన్స్, డైలాగులు మరియు మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మరియు ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్ సినిమాకి మైనస్ పాయింట్లుగా మారాయి. చివరిగా రామ్ అభిమానులనే కాక పూరి జగన్నాధ్ అభిమానులను కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ మెప్పించే సినిమా.
చాలా రోజుల తర్వాత పూరి మార్క్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’.