రామ్ తో కూర్చొని రాసిన కథ ఇది

సాధారణంగా కథలు రాయాలంటే బ్యాంకాక్ వెళ్తాడు దర్శకుడు పూరి జగన్నాధ్. అవసరమైతే అక్కడే మరో 2 రోజులు ఉండి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా పూర్తిచేసి ఇంటికి వస్తాడు. బ్యాంకాక్ తో ఈ దర్శకుడికి ఎంత ఎటాచ్ మెంట్ ఉందంటే.. అక్కడ ఓ హోటల్ లో ఇతడికి పెర్మనెంట్ రూమ్ ఉంది. ఎప్పుడు వెళ్లినా ఆ రూమ్ ఇవ్వాల్సిందే. అంతేకాదు.. పక్కనే ఉన్న బీచ్ లో పర్మెనెంట్ సిట్టింగ్ కూడా ఉంది. ఆ చుట్టుపక్కలున్న అందరికీ పూరి […]

Advertisement
Update:2019-07-16 12:30 IST

సాధారణంగా కథలు రాయాలంటే బ్యాంకాక్ వెళ్తాడు దర్శకుడు పూరి జగన్నాధ్. అవసరమైతే అక్కడే మరో 2 రోజులు ఉండి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా పూర్తిచేసి ఇంటికి వస్తాడు. బ్యాంకాక్ తో ఈ దర్శకుడికి ఎంత ఎటాచ్ మెంట్ ఉందంటే.. అక్కడ ఓ హోటల్ లో ఇతడికి పెర్మనెంట్ రూమ్ ఉంది. ఎప్పుడు వెళ్లినా ఆ రూమ్ ఇవ్వాల్సిందే. అంతేకాదు.. పక్కనే ఉన్న బీచ్ లో పర్మెనెంట్ సిట్టింగ్ కూడా ఉంది. ఆ చుట్టుపక్కలున్న అందరికీ పూరి ఎంతగానో తెలుసు.

బ్యాంకాక్ తో అంత అనుబంధం ఉన్న పూరి జగన్నాధ్, ఇస్మార్ట్ శంకర్ కోసం మాత్రం అక్కడికి వెళ్లలేదట. ఈ విషయాన్ని స్వయంగా పూరి జగన్నాధ్ చెప్పుకొచ్చాడు. రామ్ తో కలిసి కూర్చొని రాశాడట ఈ కథ.

“రామ్ ను కలిసినప్పుడు కథ కూడా లేదు. గుడ్ బాయ్ గా చేసి బోర్ కొట్టింది, నన్ను బ్యాడ్ బాయ్ ను చేయండని రామ్ అడిగాడు. అలా ఇద్దరం కూర్చొని ఓ బ్యాడ్ బాయ్ స్టోరీ రాసుకున్నాం. అదే ఇస్మార్ట్ శంకర్.”

సాధారణంగా తన సినిమాల్లో హీరోలంతా బ్యాడ్ బాయ్స్ గానే కనిపిస్తారని, రామ్ కూడా అందుకు అతీతం కాదంటున్నాడు పూరి. అయితే బ్యాడ్ బాయ్ లో కూడా మంచి లక్షణాలు చూపించడం తన ప్రత్యేకత అంటున్నాడు. ఇక ఇస్మార్ట్ శంకర్ విషయానికొస్తే, ఈ కథను ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో రాసుకున్నానని చెప్పుకొచ్చాడు పూరి.

“ఏ ఆలోచనైనా నేను హాలీవుడ్ నుంచే ఇన్ స్పైర్ అవుతాను. నేను రాసిన కథలన్నింటినీ హాలీవుడ్ సినిమాలే స్ఫూర్తి. ఈ సినిమాలో హీరోది బ్యాడ్ క్యారెక్టరైజేషనే. కానీ ఆ చెడులో కూడా మంచి కనిపిస్తుంది. నా సినిమాల్లో అది ఎప్పుడూ ఉంటుంది.”

ఈ గురువారం థియేటర్లలోకి వస్తోంది ఇస్మార్ట్ శంకర్. ఎప్పట్లానే సినిమా రిలీజ్ కు 2 రోజుల ముందే రామ్ విదేశాలకు చెక్కేశాడు. ఫోన్ కూడా స్విచాఫ్ చేశాడు. మళ్లీ ఇండియాకు వచ్చిన తర్వాత మాత్రమే సినిమా రిజల్ట్ తెలుసుకుంటాడు ఈ హీరో.

Tags:    
Advertisement

Similar News